ఆసిఫాబాద్ రూ.200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు

0
281

భారత్ అవాజ్, కుమురం భీం ఆసిఫాబాద్ బ్యూరో:తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆసిఫాబాద్ మండల పరిధిలోని అంకుసాపూర్ శివారులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన మోడల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను స్థానిక రైతులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. దాదాపు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో ఈ విద్యా సంస్థ భవన సముదాయాన్ని నిర్మించేందుకు అధికారులు క్షేత్రస్థాయికి చేరుకోవడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వం ఈ పాఠశాల నిర్మాణం కోసం 87 సర్వే నంబర్‌ పరిధిలోని స్థలాన్ని కేటాయించింది. అయితే, ఈ సర్వే నంబర్‌లోని భూమి ప్రభుత్వానిది కాదని, తాము తమ తాతల కాలం నుండి తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పనుల నిమిత్తం అధికారులు అక్కడికి తీసుకువచ్చిన కంటైనర్ గదులను, ఇతర నిర్మాణ సామాగ్రిని ఏమాత్రం ఏర్పాటు చేయనివ్వకుండా రైతులు అడ్డుకుని నిరసనకు దిగారు. రైతుల ఆందోళనతో సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్తూ ఒక రైతు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన సాగు భూమిని లాక్కోవద్దంటూ సదరు రైతు అక్కడికి వచ్చిన తహసీల్దార్ కాళ్లు పట్టుకుని, కన్నీరుమున్నీరుగా ప్రాధేయపడటం అక్కడున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేసింది. తమ నోటి కూడు లాక్కోవద్దని, ప్రభుత్వం తమ సాగు భూములను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో అంకుసాపూర్ శివారు ప్రాంతంలో ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది

Search
Categories
Read More
Andhra Pradesh
మరో రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు,, మంత్రి..మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
By Karapati Gopi 2026-06-20 10:16:38 0 401
Andhra Pradesh
ఒక దీపం ఒక ఆశీర్వాదం కార్యక్రమం
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండలంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా...
By Vinod Kumar 2026-09-17 15:39:51 0 266
Andhra Pradesh
చింతూరు: పోలవరం నిర్వాసితుడికి అన్యాయం – నోటీసులో ఒకలా... ఖాతాలో మరోలా!
పోలవరం ప్రాజెక్ట్ ముంపు బాధితులకు అందాల్సిన నష్టపరిహారం పంపిణీలో అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం...
By Shyamala Yadagiri 2026-08-21 04:12:02 0 159
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ ఎజెండాను అమలు చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన...
By Kothuru Murali 2026-02-06 12:53:09 0 187
Telangana
కల్యాణలక్ష్మి ఆపితే ఊరుకోం ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమురం భీం ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్న...
By Chunarkar Jagadeesh 2026-08-18 08:16:30 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com