వక్ఫ్ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం.|

0
112

"ప్రభావిత కాలనీలకు త్వరలో ఊరట లభించే సూచనలు"

మేడ్చల్ మల్కాజిగిరి జూలై 4: మల్కాజ్‌గిరి నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరో కీలక అడుగు వేశారు. 

శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ ఆసుదుల్లాను కలిసి సమస్య తీవ్రతను వివరించి, తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ సందర్భంగా 2024లో వక్ఫ్ బోర్డు పొరపాటున మల్కాజ్‌గిరి పరిధిలోని సర్వే నంబర్లు 3, 103, 104, 105, 144 నుంచి 154 వరకు 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంతో న్యూ విద్యానగర్, ఓల్డ్ నేరెడ్మెట్, రాంబ్రహ్మనగర్, దేవినగర్ ఎక్స్‌టెన్షన్, దేవినగర్, సైనిక్ నగర్, సీతారాం నగర్, కృష్ణా నగర్ తదితర ప్రాంతాల్లో ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఎమ్మెల్యే వివరించారు.

ఆంధ్రప్రదేశ్ గెజెట్ నం.35 పార్ట్-2 (27-08-1987), గెజెట్ నం.37 పార్ట్-2 (13-10-2001), అలాగే హైకోర్టు సి.ఆర్.పీ. నం.5057/2008 తీర్పు ప్రకారం సంబంధిత సర్వే నంబర్లు మల్కాజ్‌గిరికి కాకుండా ఉప్పల్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందినవని మంత్రి, వక్ఫ్ బోర్డు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు.

కాలనీ సంక్షేమ సంఘాల విజ్ఞప్తి మేరకు ఇప్పటికే పలుమార్లు వక్ఫ్ బోర్డు చైర్మన్, సీఈఓలను కలిసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తన ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

దీనిపై మంత్రి మహ్మద్ అజారుద్దీన్, వక్ఫ్ బోర్డు సీఈఓ ఆసుదుల్లా సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 

మల్లాపూర్ గ్రామానికి చెందిన సర్వే నంబర్లు పొరపాటున మల్కాజ్‌గిరి పరిధిలోని వక్ఫ్ జాబితాలో నమోదైనట్లు ప్రాథమికంగా గుర్తించామని, వాటిని జాబితా నుంచి తొలగించేందుకు అవసరమైన చర్యలను అత్యవసరంగా చేపడుతున్నట్లు అధికారులు తెలిపారని అన్నారు.

ఈ అంశంపై ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కూడా చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ప్రభావిత కాలనీవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మల్కాజ్‌గిరి ప్రజల హక్కులు, వారి ఆస్తుల రక్షణ కోసం తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Rajasthan
Tragic Bus-Truck Collision on Delhi-Mumbai Expressway
A devastating accident occurred early this morning on the Delhi-Mumbai Expressway in...
By Lokeshwari Panthadi 2026-07-01 08:09:55 0 112
Andhra Pradesh
నేటి సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం
*Press Release*   *నేటి సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు*   *రేపు ఆరుగురు...
By Rajini Kumari 2025-12-18 11:24:48 0 225
Andhra Pradesh
వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం చంద్రబాబు.
    వందేళ్ల వేడుక రోజు చెబుతున్నా... రాబోయే వందేళ్లలో ఏయూ చరిత్ర సృష్టిస్తుంది: సీఎం...
By Pagadala Venkateswar 2026-04-28 05:57:51 0 164
Andhra Pradesh
విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్...
By Mobbu Venkatramana 2026-03-19 12:06:29 0 537
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: బాణసంచా కేంద్రాల మూసివేతకు ఎస్పీ ఆదేశం.
కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో, జిల్లాలోని టపాసుల తయారీ మరియు విక్రయ కేంద్రాలపై ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-04 11:49:09 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com