నేటి సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం

0
225

*Press Release*

 

*నేటి సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు*

 

*రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం*

 

*శనివారం అనకాపల్లిలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’కు హాజరు*

 

*అమరావతి, డిసెంబర్ 18:* రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. శుక్రవారం వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, కేంద్ర జల్‌ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, కేంద్ర నౌకాయాన, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో భేటీ అవుతారు. కేంద్ర భాగస్వామ్యంతో రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తారు. తిరిగి శుక్రవారం రాత్రి అమరావతి చేరుకుంటారు. శనివారం అనకాపల్లి జిల్లాలో జరిగే ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొంటారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు ఆలయ కమిటీ
ప్రకటన: ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు          ...
By Rajini Kumari 2025-12-30 10:46:20 0 261
Andhra Pradesh
జనసేన పార్టీ పదవుల కోసం ప్రొఫైల్ సేకరణ ప్రారంభం.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన పార్టీలో పదవుల కోసం వీర సైనికులు,...
By Pagadala Venkateswar 2026-06-29 08:00:42 0 120
Andhra Pradesh
విజయవాడ నగరపాలక సంస్థ 62వ డివిజన్లో 43 లక్షలతో ఉద్యానవనం ప్రారంభం
విజయవాడ నగరపాలక సంస్థ  27-12-2025       *ఈ పార్క్ ప్రజలది దీన్ని...
By Rajini Kumari 2025-12-27 10:35:03 0 426
SURAKSHA
Shri Gopala Krishna Ronanki: Inspiring Rural India Through IAS
From a Telugu-medium village student to an IAS officer, Gopala Krishna Ronanki has emerged as a...
By Lokeshwari Panthadi 2026-07-16 12:39:32 0 202
Andhra Pradesh
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం సీతయ్య పేటలో...
By Boiena Rajesh 2026-03-18 08:22:36 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com