అల్వాల్ మచ్చ బొల్లారం కు చెందిన కిలాడి లేడిని అరెస్ట్ చేసిన వారసుగూడ పోలీసులు

0
2K

సికింద్రాబాద్.. మారువేషం ధరించి రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడీ లేడిని వారసి గూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుండి 8 లక్షల విలువైన నగదు బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డిసిపి నరసయ్య తెలిపారు. ఆల్వాల్ మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డమీద విజయా అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 23వ తేదీన వారాసి గూడ లో దుర్గా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు..దొంగతనం చేసే క్రమంలో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీరలో వచ్చి దొంగతనం చేసి మారు వేషంలో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.చీరలో వచ్చిన విజయ ఇంట్లో తాళాలు పగలగొట్టి అల్మారలో ఉన్న నగదు విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకొని ప్యాంట్ షర్ట్ మాస్క్ ధరించి పరారైనట్లు పోలీసులు తెలిపారు. తీర్థయాత్రల కోసం కుటుంబం శ్రీకాళహస్తికి వెళ్లిన నేపథ్యంలో దొంగతనం జరిగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారసి గుడా పోలీసులు 500 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితురాలు విజయ ను పట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇదివరకే దుర్గా కు విజయ పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Search
Categories
Read More
Telangana
ఐజి విగ్రహం నుండి ఐస్ ఫ్యాక్టరీ వరకు 100 అడుగుల రహదారి నిర్మాణం- ప్రజల డిమాండ్ మేరకు ఎమ్మెల్యే తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్.     బీఆర్‌ఎస్ నాయకుడు ప్రశాంత్ రెడ్డి...
By Sidhu Maroju 2025-09-14 11:08:55 0 141
Telangana
గణేష్ ఉత్సవాలు ఐక్యతకు ప్రత్యేకంగా నిలుస్తాయి : బిఆర్ఎస్ నాయకులు శంబీపూర్ కృష్ణ.
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:   వినాయక చవితి ఉత్సవాల భాగంగా ...
By Sidhu Maroju 2025-09-09 17:12:50 0 174
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com