జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు

0
1K

కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం..

హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు

 

ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసమే తెలంగాణ జర్నలిస్టు యూనియన్ పాటు పడుతుందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కప్పర ప్రసాద్  పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం యూనియన్ కార్యాలయాన్ని ఆయన గాజుల రామారావు డివిజన్ పరిధిలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కప్పర ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ ప్రభుత్వానికి తలొంచి జర్నలిస్టుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి అతిధులుగా విచ్చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు కార్యాలయం సందర్శించి నూతన కార్యవర్గాన్ని అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జగన్ విదేశీ పర్యటన ముగింపు దశలోకి |
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. వ్యక్తిగత...
By Bhuvaneswari Shanaga 2025-10-11 07:19:32 0 28
Bharat Aawaz
"The Silent Struggle – How Discrimination Still Shadows Equality"
Article 14 of the Indian Constitution promises equality before law. But is this promise felt in...
By Citizen Rights Council 2025-07-24 06:49:51 0 1K
Andhra Pradesh
వామ్మో ఇది మన నగర పంచాయతీ ..కాలం చెల్లిన నగర పంచాయతీ చూస్తే ప్రజలకు భయం వేస్తుంది,,,
పేరుకే నగర పంచాయతీ అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు, వర్షం వస్తే చాలు కంప్యూటర్లు,ఫైళ్లను మూత...
By mahaboob basha 2025-08-18 23:26:41 0 434
Goa
गोवा विद्यापीठ-INCOIS MoU समुद्र संशोधनात वादस्पद सहकार्य
गोवा विद्यापीठ आनी #INCOIS यांच्यात आपत्ती व्यवस्थापन आनी #समुद्रसंशोधन क्षेत्रात सहकार्य...
By Pooja Patil 2025-09-13 09:26:48 0 48
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com