ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

0
234

*ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను జయప్రదం చేయండి* 

 

 *సమ్మె జయప్రదం కొరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన గుంటూరుజిల్లా జీపు జాత శుక్రవారం నాడు రాజధాని లోని ఎర్రబాలెం వచ్చిన సందర్భంగా స్వాగతం పలుకుతున్న సిఐటియు నేతలు, మున్సిపల్ కార్మికులు*

*

*రాజధాని లోని ఎర్రబాలెంలో మాట్లాడుతున్న* *సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి* 

*జి. రమణ*

 

*లేబర్ కోడులను రద్దు చేయాలి*

 

*సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి* 

*జి.రమణ డిమాండ్* 

*

ఈ సందర్భంగా సిఐటియు రాజధాని డివిజన్ నాయకులు ఎం రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు గుంటూరు జిల్లా కార్యదర్శి జి. రమణ మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అన్నారు 

 

స్వతంత్రం వచ్చిన నాటినుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తొలగించి వాటి స్థానంలో కార్పొరేట్లకు వత్తాసుగా నాలుగు లేబర్ కోడులను తీసుకువచ్చిందని 

ఇవి అమలు జరిగితే కార్మికులు కట్టు బానిసలుగా మారతారని సాధించుకున్న హక్కులన్నీ కోల్పోతారని అన్నారు 

 

కార్మిక వర్గానికి ఉరి తాళ్లుగా మారే లేబర్ కోడులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తక్షణం ఉపసంహరించు

కోవాలని రమణ డిమాండ్ చేశారు 

 

కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు 

 

రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పని గంటల పెంపు, మహిళలతో రాత్రిపూట డ్యూటీలు చేపించాలనె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు 

 

కార్మిక వ్యతిరేక విధానాలను పాలకులు విడనాడకపోతే కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని రమణ హెచ్చరించారు 

 

ఏఐటి యుసి గుంటూరు జిల్లా అధ్యక్షులు

 ఏ అరుణ్ కుమార్ మాట్లాడుతూ 

కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు 

 

ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు

 

ఈ కార్యక్రమంలో సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు 

బి లక్ష్మణరావు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాజధాని ప్రాంత నాయకులు ఆదిలక్ష్మి ఎం పార్వతి చిన్న శ్రీను కొండలు శ్రీలక్ష్మి రమాదేవి ఎస్కే సుభాని గాంధీ కోటేశ్వరరావు తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Media Academy
Modern Media & Journalism:
In the rapidly evolving digital age, journalism has undergone a remarkable transformation,...
By Media Academy 2025-05-01 06:17:39 0 3K
Health & Fitness
మైలారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
శాయంపేట మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరోగ్య సంరక్షణ ప్రతినిధి అరికిల్ల సుమన్(CRA)...
By Sriramula Anil 2026-07-10 08:40:30 0 286
Andhra Pradesh
ఘనంగా దుగ్గిరాల గోపాలకృష్ణ జయంతి
చీరాల N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ నందు ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల...
By Vadlamudi NagaVenkat 2026-06-02 16:24:19 0 358
Andhra Pradesh
అంబటి అరెస్టు అన్యాయం మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చగొట్టి, దాడులకు తెగబడి అరెస్టు...
By Gadiyapudi Narendra 2026-02-04 16:53:00 0 225
Andhra Pradesh
నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
బ్రేకింగ్... నూజివీడు...   నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..   ...
By Rajini Kumari 2025-12-29 08:46:14 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com