రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా గారు

0
125

రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు

ఢిల్లీలో పార్లమెంట్‌లో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారు గుంటూరుకు విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన స్వాగత యాత్రలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి గారు పాల్గొన్నారు.

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్–1లోని భాష్యం గరుడ క్యాంపస్ నుండి ప్రారంభమైన స్వాగత యాత్రలో ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు పాల్గొని, రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి మొక్కను బహుకరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీమతి గళ్ళా మాధవి గారు మాట్లాడుతూ, శ్రీ భాష్యం రామకృష్ణ గారు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేయడం గుంటూరు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను సమర్థవంతంగా రాజ్యసభలో ప్రస్తావిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల సాధనకు ఆయన కీలక పాత్ర పోషిస్తారని నమ్మకాన్ని శ్రీమతి గళ్ళా మాధవి గారు వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*మంగళగిరి గ్రామీణ సర్కిల్ పోలీస్ స్టేషన్‌లో సెమీ క్రిస్మస్ వేడుకలు*  ...
By Rajini Kumari 2025-12-24 07:56:23 0 231
Telangana
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్‌ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...
By Sidhu Maroju 2025-11-28 05:22:34 0 243
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:33:54 0 203
Andhra Pradesh
Ambati Rambabu: ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు.
Andhra Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-06 13:21:00 0 182
Andhra Pradesh
మదనపల్లిలో రోడ్డు ప్రమాదం గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు
మదనపల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సుమారు...
By Pagadala Venkateswar 2026-01-15 11:30:01 0 274
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com