Ambati Rambabu: ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు.

0
179

Andhra

Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై 7 కేసులు నమోదు

 

అన్ని కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేసిన అంబటి

నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన హైకోర్టు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆయనపై పట్టాభిపురం, మంగళగిరి, నగరంపాలెం, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. 

 

ఇప్పటికే నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణను ఈ నెల 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి పీఎస్ లో నమోదైన కేసులో తప్పనిసరిగా బీఎన్ఎస్ 35(3)ను అనుసరించాలని మంగళగిరి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

 

మిగిలిన 5 కేసులకు సంబంధించిన క్వాష్ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్వాష్ పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

 

మరోవైపు, అంబటిపై పీటీ వారెంట్ పొందేందుకు మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.

Search
Categories
Read More
Maharashtra
IMD Issues Monsoon Orange Alert for Coastal Maharashtra
The India Meteorological Department (IMD) has officially issued an Orange Alert for several...
By Lokeshwari Panthadi 2026-07-01 07:22:13 0 191
Telangana
గంగ అవెన్యూ వాసుల గోస.. రంగంలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గంగ అవెన్యూ మరియు దాని చుట్టుపక్కల కాలనీల నివాసితుల విజ్ఞప్తి మేరకు...
By Sidhu Maroju 2026-03-18 14:13:00 0 262
Maharashtra
Kolhapur’s Ambabai Temple Transformation Plan
he historic Shri Ambabai (Mahalaxmi) Temple in Kolhapur is set for a massive transformation...
By Lokeshwari Panthadi 2026-06-27 06:44:16 0 102
Telangana
"పోలీసుల రైడ్‌తో కుదేలైన నకిలీ సర్టిఫికెట్ల ముఠా – అల్వాల్‌లో బిగ్ బస్ట్.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అనుమతి లేకుండా నకిలీ అఫిడవిట్లు, ముందుగానే సంతకాలు చేసిన ధ్రువీకరణ...
By Sidhu Maroju 2026-04-16 15:05:52 0 309
Telangana
" ఐపీఎస్ ‘ఖద్దరు’ కడితే.. బహుజన ‘ఆశ’ గడీల పాలైందా?
హైదరాబాద్ : ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ రాజకీయ ప్రస్థానం, సిద్ధాంతాల ఘర్షణపై ప్రత్యేక...
By Sidhu Maroju 2026-05-21 17:43:08 0 527
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com