నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు

0
239

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల కార్యాలయంలో MSME ఆధ్వర్యంలో చేతివృత్తుల కార్మికులు, డ్వాక్రా మహిళలకు సబ్సిడీతో కూడిన రుణాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో లబ్ధిదారులకు వివిధ రకాల MSME రుణ పథకాల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. అనంతరం అర్హులైన సభ్యుల నుంచి రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించి పూర్తి చేయించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎం.ఏ. పాషా మాట్లాడుతూ, MSME ద్వారా చేతివృత్తుల వారు ఎటువంటి తాకట్టు లేకుండా రుణాలు పొందే విధానం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీ వివరాలు, స్వయం ఉపాధి అవకాశాల గురించి వివరించారు.MSME ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చేతివృత్తుల కార్మికులు, డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో రక్తదానం శిబిరం జరిగినది, రక్తదానం చేసి ప్రాణదాతలు కండి.
పుంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-01-30 15:13:46 0 206
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్...
By Pagadala Venkateswar 2026-02-02 05:11:59 0 229
Telangana
లక్షేటిపేట వద్ద వడ్ల కొనుగోలు కేంద్రం, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా లక్షెట్‌పేట్ సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం...
By Avunoori Mahesh 2026-05-08 15:03:19 0 240
Telangana
నిజామాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ...
By Sadaq Sadaq 2026-04-24 12:09:06 0 182
Andhra Pradesh
వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.
AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
By Pagadala Venkateswar 2026-09-03 12:31:26 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com