చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన

0
410

చంద్రబాబు “వెన్నుపోటుకు రెండేళ్లు”నిరసన కార్యక్రమం.!

 

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం శ్రీశైలం రోడ్డులోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నుండి బస్టాండ్ సెంటర్ లోని దివంగత మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహం వరకు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు..!!

 

ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా నియోజకవర్గాల పరిశీలకుడు పూనూరు గౌతంరెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు మరియు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. 

 

ర్యాలీ అనంతరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. ఉమ్మడి మేనిఫెస్టో పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి, అనంతరం హామీలను విస్మరించడం ప్రజా విశ్వాసానికి చేసిన ద్రోహమని అన్నారు.

 

డీఎస్సీ నియామకాల విషయంలో సుమారు మూడు లక్షల మంది అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, పారదర్శకత లేకుండా తమకు అనుకూలమైన వారికే ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీని ప్రజలకు ఉపయోగపడే పథకంగా కాకుండా “అనారోగ్యశ్రీ”గా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందని ఎద్దేవా చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అతిగా మద్యం సేవించి నాయి బ్రాహ్మణుడు మృతి.
మదనపల్లెలో అతిగా మద్యం సేవించడం వల్ల సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీకి చెందిన నారాయణ అనే...
By Pagadala Venkateswar 2026-06-23 06:11:17 0 107
Jammu & Kashmir
Project Hawk Eye: High-Tech Shield for Amarnath Yatra 2026
The annual Shri Amarnath Ji Yatra has received a massive technological upgrade with the...
By Lokeshwari Panthadi 2026-06-29 09:28:25 0 99
Telangana
రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టిన మహిళలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-09 17:03:18 0 822
Bharat
Civil Services Exam Registrations Witness a Slight Decline in Hyderabad Prelims 2025 scheduled for Sunday
Civil Services Exam Registrations Witness a Slight Decline in HyderabadPrelims 2025 scheduled for...
By BMA ADMIN 2025-05-24 08:15:10 0 3K
Andhra Pradesh
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అంబటి రాంబాబు చేసిన తప్పేంటి..?...
By Gadiyapudi Narendra 2026-02-04 16:48:11 0 458
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com