రాఖీ పౌర్ణమి సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టిన మహిళలు

0
611

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :

 

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు  ఎమ్మెల్యే గారికి రాఖీ కట్టి, అక్కాచెల్లెళ్ల బంధాన్ని ప్రతిబింబించే ఈ సాంప్రదాయాన్ని ఎంతో సౌభ్రాతృత్వ భావంతో జరుపుకున్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ...అమ్మాయిలు, మహిళలు సమాజ అభివృద్ధికి మూలస్తంభాలు. మహిళల రక్షణ, సంక్షేమం నా మొదటి కర్తవ్యం. ఈ రాఖీ నాకు ఆ బాధ్యతను మరింత గుర్తు చేస్తుంది” అని పేర్కొన్నారు. అదే విధంగా రాఖీ పౌర్ణమి ప్రేమానుబంధాలకు, సహోదరత్వానికి ప్రతీక అని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్ పండుగ, ఆడబిడ్డలు తమ అన్నలకు జీవితాంతం అండగా ఉండాలని ఆశిస్తూ కట్టే రక్షాబంధనం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజల్లో సహోదరభావాన్ని పెంపొందించే ఈ పండుగను నియోజకవర్గ ప్రజలంతా ఆనందోత్సాహాల్లో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీతరాము యాదవ్, బీఆర్‌ఎస్ మహిళా నాయకులు శ్రీదేవి, సూలోచన, సరిత, శారద దేవి,తో పాటు పార్టీ కార్యకర్తలు, మహిళలు అభిమానులు పాల్గొన్నారు.

   - sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పీజీ కోటా కోసం వైద్యుల పోరాటం: ప్రమోషన్ల పై దీక్ష |
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ వైద్య సేవలకు వెన్నెముకగా నిలుస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC)...
By Meghana Kallam 2025-10-10 01:28:35 0 40
Telangana
2025–30 టూరిజం పాలసీతో తెలంగాణకు పర్యాటక పునరుజ్జీవనం |
తెలంగాణ ప్రభుత్వం 2025–30 పర్యాటక విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో భాగంగా వికారాబాద్...
By Bhuvaneswari Shanaga 2025-09-29 07:54:14 0 29
Goa
Goa to Launch New Sports Policy by 2025, Says SAG Chief |
Goa will unveil a new Sports Policy by the end of 2025, according to Ajay Gaude, the...
By Pooja Patil 2025-09-16 08:55:38 0 232
Mizoram
Assam Rifles Seize Rs 113 Crore Drugs and 7,000 Detonators in Mizoram
In a major anti-narcotics operation in Mizoram’s border region, Assam Rifles recovered...
By Bharat Aawaz 2025-07-17 07:06:14 0 878
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com