ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.

0
116

 

 

ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

12-06-2026 Fri 

Andhra

Southwest Monsoon spreads in AP Heavy rain forecast for several districts

ఏపీలోకి ప్రవేశించి చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక

పిడుగులతో కూడిన వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచన

వర్షాల నేపథ్యంలో ఖరీఫ్ పనులను వేగవంతం చేసిన రైతులు

ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమ, కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలను తాకిన రుతుపవనాలు, రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా పూర్తిగా విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల కదలిక చురుగ్గా ఉండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

 

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తెలంగాణ నుంచి దక్షిణ కోస్తా వరకు మరో ద్రోణి ఏర్పడింది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

 

మరోవైపు పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు పలు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని సూచించింది. ఇప్పటికే బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు విజయవాడతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

 

ఈ ఏడాది ఆరంభంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉంటుందనే అంచనాలు వెలువడినప్పటికీ, జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుండటం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. ప్రభుత్వం ఇప్పటికే పంట కాలువలకు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించడంతో, రైతులు ఖరీఫ్ సాగు పనులను ముమ్మరం చేశారు. తాజా వర్షాలు వ్యవసాయ పనులకు మరింత ఊతమిచ్చాయి

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.
శుక్రవారం ఉదయం మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొందికి చెందిన శ్రీరాములు నాయుడు...
By Pagadala Venkateswar 2026-05-22 12:36:15 0 142
Telangana
Telangana 10th results tomorrow
హైదరాబాద్‌: రేపు టెన్త్ ఫలితాల విడుదల తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు...
By G k Nookala 2026-04-28 08:52:42 0 220
Andhra Pradesh
ఈనెల 4న పీసీసీ చీఫ్‌ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.
చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4వ...
By Gadiyapudi Narendra 2026-03-02 17:21:39 0 267
Rajasthan
Agricultural Development and Farmer Welfare in Rajasthan
Rajasthan continues to strengthen its agricultural sector through various farmer welfare programs...
By Fathima Safa 2026-06-23 09:22:21 0 341
Andhra Pradesh
దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు
తుమ్మలపల్లి   *25-12-2025*    *దాత్రుత్వంతో మనసు గెలుచుకున్న మారాజు...
By Rajini Kumari 2025-12-25 07:57:21 0 343
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com