ఈనెల 4న పీసీసీ చీఫ్‌ షర్మిల జిల్లా పర్యటన. పర్చూరు,చీరాలలలో ఉపాధి పథకంపై రచ్చబండ విలేకరుల సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీనేతలు.

0
265

చీరాల: ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4వ తేదీ బుధవారం  బాపట్ల జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.జిల్లా పార్టీ అధ్యక్షులు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆదేశాలతో సోమవారం వేటపాలెం మండలం కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియెజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు  పీసీసీ చీఫ్‌ షర్మిల పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించారు.ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈనెల 4 వ తేదీ బుధవారం పర్చూరు నియెజకవర్గం ఇంకొల్లు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి చీరాల నియెజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్త పేట గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని స్వష్టం చేశారు.కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారన్నారు.కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు నుంచి మహాత్మగాంధీ పేరు తొలగించి, పథకం పేరు మార్చిన వైనాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందన్నారు.అనంతరం కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమై పార్టీని బలోపేతం చేయడంపై చర్చించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మార్పు గ్రెగొరీ ,ఏపీసీసీ మెంబర్ సయ్యద్ అల్లిం  బాబు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు ,మాజీ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు ,షేక్ రెహమాన్ ,మిరియాల శ్రీనివాస్, దేవరపల్లి బాబురావు ,AMC మాజీ డెరెక్టర్ కనపర్తి బజ్జిబాబు ,మేరిగ ఇస్సాక్, మేరిగ రమేష్ ,పులి శంకర్ తదితరాలు పాల్గొన్నారు .

 

#Narendra

Search
Categories
Read More
SURAKSHA
Dr. K. Manivasan IAS: Guiding Tamil Nadu's Home Affairs
A distinguished 1993-batch IAS officer whose decades of administrative excellence, people-centric...
By Lokeshwari Panthadi 2026-07-25 12:48:07 0 162
Andhra Pradesh
పుంగనూరు: కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు
పుంగనూరు మండలం, సుగాలిమిట్ట మలుపు వద్ద శుక్రవారం రాత్రి కంటైనర్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల...
By Kothuru Murali 2026-06-08 14:26:25 0 120
Telangana
ఇంజెక్షన్‌తోనే పిల్లలు పుడతారట.. నమ్మి వెళ్లిన ఆ దంపతులు.. చివరకు..
హైదరాబాద్‌లో సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న...
By Ponnala Srinivasrao 2026-06-24 01:37:00 0 184
Telangana
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు : సీపీ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాలు...
By Bonagiri RaviShankar 2026-08-01 03:42:30 0 221
Andhra Pradesh
నందవరంలో శ్రీమాతా బంగారం అవ్వ దేవాలయమును దర్శించుకున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
నందవరం మండలం, గ్రామం నేడు ఆధ్యాత్మికోత్సాహంతో కళకళలాడింది. భక్తి పరవశంలో మునిగిపోయిన గ్రామ ప్రజల...
By Boya Dasthagiri 2026-04-02 10:03:20 0 310
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com