"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|

0
142

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ జయగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమీపంలో ఇస్కాన్ టెంపుల్ – శ్రీ గౌరంగ దాం సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం కోసం సుమారు 1500 గజాల స్థలాన్ని కేటాయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. 

ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించి, భక్తులకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా మల్కాజ్‌గిరి డివిజన్ శివపురి కాలనీలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధి నుంచి మినహాయించి చారిటబుల్ ట్రస్ట్ కింద పరిగణించాలని కోరుతూ మరో వినతిపత్రాన్ని అందజేశారు.

ఓల్డ్ మల్కాజ్‌గిరిలోని శ్రీ విష్ణు దేవాలయానికి చెందిన స్థలంలో మున్నూరు కాపు భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని మంత్రిని అభ్యర్థించారు.

వినతిపత్రాలను స్వీకరించిన మంత్రి కొండా సురేఖ సంబంధిత అంశాలపై సానుకూలంగా స్పందించి, ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, వెంకన్న, నవీన్ పాల్గొన్నారు. 

అలాగే ఇస్కాన్ టెంపుల్ – శ్రీ గౌరంగ దాం సేవా ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డితో పాటు సంస్థ ప్రతినిధులు, భక్తులు మరియు స్థానిక ప్రముఖులు హాజరయ్యారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
భావితరాల కోసం రోడ్డు విస్తరణ కార్యక్రమం చేపట్టిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల : సమాజ శ్రేయస్సు దృష్ట్యా భావితరాలకు మేలు కలగాలని లక్ష్యంగా పెట్టుకుని లక్షేట్టిపేట్...
By Avunoori Mahesh 2026-04-13 13:08:08 0 207
Andhra Pradesh
10వ తరగతి పాసైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు...
By Patan Khuddus 2026-05-11 11:24:12 0 391
SURAKSHA
Praveen Kumar Sinha IPS: A Visionary Guardian of Punjab
From intelligence-led policing to vigilance reforms, 1994-batch IPS officer Praveen Kumar Sinha...
By Lokeshwari Panthadi 2026-07-25 11:55:40 0 184
Andhra Pradesh
పుంగనూరు: చిన్నారి వైద్యానికి ఆర్థికంగా అండగా ఎంపీ
అన్నమయ్య జిల్లా, ముదివేడు గ్రామానికి చెందిన 10 ఏళ్ల ఆలియా అనే చిన్నారికి గుండెలో రంధ్రం ఉన్నట్లు...
By Kothuru Murali 2026-06-22 10:53:22 0 122
Andhra Pradesh
Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా...
By Pagadala Venkateswar 2026-01-26 05:55:44 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com