10వ తరగతి పాసైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు పంపిణీ

0
387

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు  కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని,ఇటీవల వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయని సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ అన్నారు.చందర్లపాడు మండలం కోనాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతిలో 31మంది విద్యార్థులకు గాను 30 మంది విద్యార్థులు పాస్ అయినారు.సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు వాసిరెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో 30 మంది పదవ తరగతి పాసైన విద్యార్థులకు సీల్డ్ తో పాటు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున నగదు ప్రోత్సకాలను సోమవారం సొసైటీ బ్యాంకు లో అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కఠోర దీక్ష,నిరంతర సాధనను అలవర్చుకొని చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు.చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.విద్యార్థుల ఎదుగుదలలో కుటుంబం,కుటుంబాల ఎదుగుదలలో దేశం ఉండాలని కోరారు.ఏ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ సిబ్బంది,స్కూల్ చైర్మన్ మార్కపూడి జాన్ కోటయ్య,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: ఎయిర్ పోర్ట్ రన్‌వేపై పవన్ కల్యాణ్, మంచు మనోజ్ ఆసక్తికర భేటీ... వీడియో ఇదిగో!
బేగంపేట విమానాశ్రయంలో అనుకోకుండా కలుసుకున్న పవన్, మనోజ్ పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా...
By Pagadala Venkateswar 2026-02-06 14:13:32 0 180
Telangana
రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు
రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు తెలంగాణ : రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరికొన్ని చోట్ల...
By Pinnehasan Odela 2026-04-09 14:38:46 0 259
Andhra Pradesh
ViT సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లో ప్రారంభించిన కేంద్రమంత్రి
పత్రికా ప్రకటన    *వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన...
By Rajini Kumari 2025-12-20 11:45:01 0 220
Andhra Pradesh
గుడివాడ బైపాస్ రోడ్ నిర్మాణం పనులు చేపట్టినMLA వెనిగండ్ల రాము గారు
*గుడివాడ ప్రజల భావోద్వేగ సమస్యలలో ఒకటైన... బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నాం:ఎమ్మెల్యే...
By Rajini Kumari 2025-12-28 09:56:25 0 199
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com