Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు.

0
227

టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా లోకేశ్ 

రాష్ట్ర మంత్రులతో సమన్వయం కోసం ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను అప్పగించినట్లు వెల్లడి

శాఖాపరమైన అంశాలపై కేంద్రంతో సమన్వయం కోసం పరస్పరం చర్చించుకోవాలని సూచన

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. రాష్ట్ర మంత్రులతో సమన్వయం కోసం ప్రతి ఎంపీకి కొన్ని శాఖలను అప్పగించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత శాఖా మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు, ఆ శాఖకు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా హాజరుకావాలని సూచించారు.

 

తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆయన నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా దర్బార్‌లో మంత్రులు, ఎంపీలు కలిసి పాల్గొనడంతో పాటు, శాఖాపరమైన అంశాలపై కేంద్రంతో సమన్వయం కోసం పరస్పరం చర్చించుకోవాలని నారా లోకేశ్ సూచించారు. ప్రస్తుతం రెండు సెషన్ల కింద బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో, మొదటి సెషన్ అనంతరం వచ్చే విరామ సమయంలో ప్రతి ఎంపీతో వ్యక్తిగతంగా సమావేశమై అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

 

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర సమస్యలపై ఎంపీలు పూర్తి అవగాహనతో అప్‌డేట్‌గా ఉండాలని లోకేశ్ సూచించారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ఎమ్మెల్యేల మధ్య బంధం మరింత బలపడేలా ఎంపీలు కృషి చేయాలని కోరారు. ఎంపీల పనితీరుపై కేంద్రం నుంచి వస్తున్న నివేదికలు సానుకూలంగానే ఉన్నప్పటికీ, పనితీరును ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి చురుగ్గా పని చేయాలని, కార్యకర్తల సమస్యలను తెలుసుకుని వారు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
మరో అడ్వెంచర్ సభ్ మెరైన్ లో ప్రయాణిస్తున్న రాష్ట్ర పతి ద్రౌపది ముహూర్తము..
రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము మరో అడ్వెంచర్ కు సిద్ధమవుతున్నారు. కర్ణాటక లోని కార్వార్ హార్బర్ నుంచి...
By Karapati Gopi 2025-12-28 02:21:38 0 451
Punjab
Punjab's Drug Abuse Prevention and Awareness Efforts
Drug abuse prevention remains a major priority in Punjab, with authorities strengthening efforts...
By Fathima Safa 2026-06-16 10:08:57 0 171
Andhra Pradesh
ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి.
ఏయూ వందేళ్ల వేడుకలు... వేదికపై నుంచి చంద్రబాబుకు నారా లోకేశ్ విజ్ఞప్తి 27-04-2026 Mon 17:13 |...
By Pagadala Venkateswar 2026-04-28 05:53:59 0 154
Rangareddy
బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన , యువనేత కోలన్ జీవన్ రెడ్డి
బాచుపల్లి: కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ శ్రీ కోలన్ హనుమంత్ రెడ్డి గారి ఆశీస్సులతో...
By Ponnala Srinivasrao 2026-08-23 01:20:04 0 204
Andhra Pradesh
మదనపల్లెలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాల పంపిణీ.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత...
By Pagadala Venkateswar 2026-04-29 05:02:29 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com