హైదరాబాద్లో రగ్బీ ప్రీమియర్ లీగ్ జెర్సీ ఆవిష్కరించిన క్రీడాశాఖ మంత్రి : శ్రీహరి

0
268

హైదరాబాద్ : రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పిఎల్) ప్రారంభోత్సవానికి విచ్చేయవలసిందిగా రగ్బీ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు మినిస్టర్ క్వార్టర్స్ లోరాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీహరి ఆర్ పి ఎల్ జెర్సీ ని ఆవిష్కరించారు. జిఎంఆర్ స్పోర్ట్స్ ,రగ్బీ ఇండియా తరపున 16 జూన్ 2026న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జి.ఎం.సి. బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ప్రారంభం కానుందని తెలిపారు,సీజన్ 2లో 10 జట్లు (6 పురుషుల ఫ్రాంచైజీలు మరియు 4 మహిళల జట్లు) పాల్గొంటాయి, ఇవి 48 మ్యాచ్‌లలో పోటీపడతాయని ఇందులో 19 దేశాల నుండి 70 మందికి పైగా అంతర్జాతీయ రగ్బీ సెవెన్స్ ఆటగాళ్లతో పాటు భారతదేశంలోని అగ్రశ్రేణి రగ్బీ ప్రతిభావంతులు కూడా పాల్గొంటారని తెలిపారు భారతదేశపు ప్రధాన ఫ్రాంచైజీ ఆధారిత రగ్బీ పోటీగా, ఈ లీగ్ క్రీడను అభివృద్ధి చేయడంలో భారత దేశం యొక్క విస్తృత క్రీడా, ఒలింపిక్ ఆశయాలకు మద్దతు ఇవ్వడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగన్నారు, తెలంగాణ క్రీడా శాఖ క్రీడలను ప్రోత్సహించడంలో వివిధ క్రీడాంశాలలో లీగ్ పోటీలకు సహకారం అందజేస్తుందని తెలిపారు,ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలా దేవి, ఆర్ పి ఎల్ నిర్వాహకులు రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నల్లమోతువారిపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సంతోష దాయకం..... ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన...
By Vadlamudi NagaVenkat 2026-03-09 14:49:05 0 771
SURAKSHA
Odisha Police Feed Poor, Free Medical Service
 Today Odisha Police staff distributed hot meals and drinking water to homeless people near...
By Kalaga Sailaja 2026-07-06 10:56:12 0 278
Andhra Pradesh
రణభేరి గంగమ్మ ఆలయ అర్చకులు మృతి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ సమీపంలోని రణభేరి గంగమ్మ ఆలయ ప్రధాన...
By Kothuru Murali 2026-06-06 15:23:06 0 121
Andhra Pradesh
రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని RPSF రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిద్ డిమాండ్ చేశారు
రాయలసీమ యూనివర్సిటీ లో అవినీతి అక్రమాలు పాల్పడుతున్న వీసీ మరియు రిజిస్టర్ పై సమగ్రమైన విచారణ...
By Boya Dasthagiri 2026-06-14 03:25:37 0 187
Andhra Pradesh
రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మార్వో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో పార్వతి సోమవారం మండల వీఆర్వోలు,...
By Kothuru Murali 2026-01-13 09:00:49 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com