ఆసిఫాబాద్ పట్టణ దస్నాపూర్ అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం మరియు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జిల్లా కలెక్టర్ కె. హరిత ఐఏఎస్

0
294

🎤 కొమురం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దాస్నాపూర్ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ కె. హరిత IAS గారు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టిందని, ప్రమాదంలో ఇళ్లు పూర్తిగా కాలిపోయి నష్టపోయిన రెండు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 95,100 ల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఆమె తెలిపారు. అలాగే ప్రమాద తీవ్రతకు పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న మరొక బాధిత కుటుంబానికి రూ. 9,000 ల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశామని, దీంతో పాటు అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు శాశ్వత నివాస వసతి కల్పించేందుకు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల ఆదేశాల మేరకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) ను ఆదేశించినట్లు కలెక్టర్ గారు చెప్పారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల అత్యవసర సహాయక చర్యలు, పునరావాస పనులు క్షేత్రస్థాయిలో నిరంతరాయంగా కొనసాగుతాయని ఆమె తెలిపారు.

Search
Categories
Read More
Telangana
"రైతు గోసకు బీజేపీ భరోసా”
హైదరాబాద్ : రైతు గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్....
By Sidhu Maroju 2026-05-26 06:17:18 0 298
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో రైల్వే ప్రమాద బాధితుడు షేక్ ఇస్మాయిల్ కుటుంబ సభ్యులను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పరామర్శించారు.
Madanapalle: రైల్వే ప్రమాదంలో దుర్మరణం చెందిన షేక్ ఇస్మాయిల్ మృతదేహానికి తెలుగు యువత రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-07-29 04:47:34 0 96
Telangana
*కొల్‌కతాలో ఉద్రిక్తత.. మెస్సి ఈవెంట్‌ ఆర్గనైజర్‌ అరెస్టు*
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి కోల్‌కతా టూర్‌ సందర్భంగా...
By SivaNagendra Annapareddy 2025-12-13 13:38:31 0 502
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు నియమాలు పాటించుకుంటే చర్యలు: ఎస్సై
పుంగనూరు అర్బన్ ఎస్సై వెంకటరమణ మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు...
By Kothuru Murali 2026-06-17 16:17:39 0 101
Meghalaya
Meghalaya Streamlines Governance via Admin Reshuffle
The Meghalaya government has initiated a significant administrative restructuring to enhance...
By Lokeshwari Panthadi 2026-07-02 06:20:17 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com