"అల్వాల్ ఫైర్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్ దిశగా అడుగులు.. అధికారులతో ఎమ్మెల్యే చర్చలు.|

0
325

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావాలనే లక్ష్యంతో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రత్యేక వినతిపత్రాలను అందజేశారు.

అల్వాల్ ప్రాంత ప్రజల భద్రతకు అత్యంత అవసరమైన ఫైర్ స్టేషన్ నిర్మాణ అంశాన్ని ఎమ్మెల్యే ప్రధానంగా ప్రస్తావించారు. 

అల్వాల్ గ్రామ కంఠం స్థలంలో 11 గుంటల భూమిని ఫైర్ స్టేషన్ కోసం కేటాయించే ప్రక్రియకు సంబంధించిన ఎమ్మార్వో లేఖలు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదించిన తీర్మాన పత్రాలను కమిషనర్‌కు అందజేశారు. 

ఫైర్ స్టేషన్ నిర్మాణంపై నెలకొన్న అపోహలను తొలగించి, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పనులను వేగవంతం చేయాలని కోరారు.

అదేవిధంగా చాణిక్యపురి పార్క్ అభివృద్ధి, నియోజకవర్గంలోని పార్కులను ఆధునీకరించి ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు, బండ చెరువు అభివృద్ధి, చెరువులకు సంబంధించిన న్యాయపరమైన వివాదాల పరిష్కారం అనంతరం అభివృద్ధి పనుల ప్రారంభం, పలు కాలనీల్లో బాక్స్ డ్రైన్లు మరియు సీసీ రోడ్ల నిర్మాణం, అలాగే ఆర్కేఎచ్ కాలనీలోని పార్కు స్థల పరిరక్షణ వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు. 

సంబంధిత అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎంఎంసీ చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, ఇంజనీరింగ్ ప్రాజెక్టు అధికారులు, మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
పుంగనూరు మండల సమీపంలో గల పెద్దపంజాని మండలం, కొలుత్తూరు పంచాయతీ గుండపల్లి గ్రామంలో గురువారం భూ...
By Kothuru Murali 2026-03-20 06:32:10 0 194
Andhra Pradesh
'ఏపీ ఫస్ట్'... తిరుపతిలో అతి పెద్ద రీసెర్చ్ సెంటర్: సీఎం చంద్రబాబు ప్రకటన.
ఏపీ ఫస్ట్స్... తిరుపతిలో అతి పెద్ద రీసెర్చ్ సెంటర్: సీఎం చంద్రబాబు ప్రకటన తిరుపతిలో 'ఏపీ ఫస్ట్'...
By Pagadala Venkateswar 2026-01-19 10:27:08 0 427
Andhra Pradesh
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు నిప్పులు కొలిమిలా మారనున్న రాబోయే నాలుగు రోజులు : పి వో. శుభం నోక్వాల్
చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.వాతావరణం...
By Shyamala Yadagiri 2026-05-21 10:29:43 0 224
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల కత్తితో దాడి చేసిన ఘటనపై కేసు నమోదు
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఆవులపల్లె పంచాయతీ రాంపల్లెలో ఈనెల 15వ తేదీ రాత్రి జరిగిన...
By Kothuru Murali 2026-01-18 09:26:34 0 204
Andhra Pradesh
కేశినేని శివనాథ్ చిన్ని గారు వినతి పత్రాల స్వీకరణ
💐💐అందరికి నమస్కారం 🙏   ఈ రోజు 18-12-2025 నాడు మన పార్లమెంట్ సభ్యులు గౌ||. *కేశినేని...
By Rajini Kumari 2025-12-18 10:02:44 0 238
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com