నేషనల్ క్రికెట్ లీగ్‌కు బాబాపూర్ గిరిజన యువకుడు ఎంపిక!

0
517

🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్ (కుమరం భీమ్ జిల్లా):

కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి మరో క్రీడా కెరటం మెరిసింది. ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామానికి చెందిన గిరిజన యువకుడు బాదావత్ శ్రీ చంద్ నాయక్ ప్రతిష్టాత్మక 'నేషనల్ క్రికెట్ లీగ్' (National Cricket League) కు ఎంపికయ్యాడు.ప్రతిభ చాటిన శ్రీ చంద్ హైదరాబాద్‌లోని సెంచూరియన్ మైదానంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అండర్-16 (U-16) క్రికెట్ క్రీడాకారుల కోసం మూడు రోజుల పాటు ఎంపిక పోటీలు (ట్రయల్స్) నిర్వహించారు. ఈ సెలెక్షన్స్‌లో శ్రీ చంద్ నాయక్ అద్భుతమైన ప్రతిభను కనబర్చి సెలెక్టర్ల ప్రశంసలు అందుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శనతో నేషనల్ లీగ్‌కు తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. బాబాపూర్ గ్రామానికి చెందిన బాదావత్ శివప్రసాద్, రజిత దంపతుల చిన్న కుమారుడైన శ్రీ చంద్ నాయక్ జాతీయ స్థాయి లీగ్‌కు ఎంపిక కావడం పట్ల స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుండి, అదీ ఒక గిరిజన యువకుడు జాతీయ స్థాయికి ఎంపికవడం గర్వకారణమని గ్రామస్తులు శ్రీ చంద్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు..సీఎంసీ కమిషనర్‌ సృజన
జగద్గిరిగుట్ట,  క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని...
By Ponnala Srinivasrao 2026-08-07 01:51:58 0 132
Telangana
ఆశా వర్కర్లకు పెండింగ్ బకాయిలను చెల్లించాలి- కార్పొరేటర్ శ్రవణ్
   మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి...
By Sidhu Maroju 2025-09-15 16:52:46 0 340
Business & Finance
In market 5kgs cylinder available
*మార్కెట్లోకి 5 కేజీల గ్యాస్ సిలిండర్..!!*    గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పటివరకు 14.2...
By G k Nookala 2026-04-05 13:18:43 0 260
Andhra Pradesh
సోమలలో వైద్యానికి వచ్చి వ్యక్తి మృతి
వైద్యం కోసం వచ్చి అదుపుతప్పి కిందపడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో జరి గింది. ఆవులపల్లె...
By Pagadala Venkateswar 2026-01-15 07:17:41 0 222
SURAKSHA
ప్రమాద రహిత రోడ్లే లక్ష్యం: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు నిరంతరం తనిఖీలు...
By Kalaga Sailaja 2026-06-25 06:47:13 0 85
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com