In market 5kgs cylinder available

0
259

*మార్కెట్లోకి 5 కేజీల గ్యాస్ సిలిండర్..!!* 

 

గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పటివరకు 14.2 కిలోల ఇంట్లో వాడే సిలిండర్, హోటల్స్, రెస్టారెంట్ల లాంటి వ్యాపారాలకు వాడే 19 కిలోల సిలిండర్ గురించి మనందరికీ తెలుసు...!! అయితే ఇప్పుడు 5 కిలోల సిలిండర్లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఈ మేరకు అన్ని గ్యాస్ కంపెనీలు 5 కేజీల సిలిండర్‌ను ప్రవేశపెట్టాయి. ఇటీవల గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగిన క్రమంలో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్ పీ గ్యాస్ కంపెనీలన్నీ ఈ చిన్న సిలిండర్లను మార్కెట్లోకి తెచ్చాయి. అద్దెఇళ్లల్లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు, వలస కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 

 *అడ్రస్ అవసరం లేదు* 

ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే అడ్రస్ ఫ్రూఫ్ అవసరమయ్యేది. అలాగే అప్లికేషన్ ఫారంలు పూర్తి చేయాల్సి వచ్చేది. అయితే 5 కిలోల గ్యాస్ సిలిండర్ తీసుకోవాలంటే ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరమే లేదు. కేవలం ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుంది. మీ సమీపంలోని ఏ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి అయినా అప్పటికప్పుడు దీనిని తీసుకుని వెళ్లవచ్చు. గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్‌కు ముందే బుక్ చేసుకుంటే ఇంటికి రావడానికి సమయం పడుతుంది. అదే ఈ చిన్న సిలిండర్‌ను మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి లేదా సమీపంలోని దుకాణాల్లో సులువుగా రీఫిల్లింగ్ చేసుకోవచ్చు.

 

 *తక్కువ ధరకే..!!* 

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛోటు పేరుతో 5 కేజీల సిలిండర్ లాంచ్ చేసింది. పెట్రెల్ పంపుల్, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, ఇండేన్ పంపిణీదారుల వద్ద దీనిని కొనుగోలు చేయవచ్చు. ఏ నగరంలో అయినా దీనిని వినియోగించుకోవచ్చు. ఇక భారత్ గ్యాస్ మినీ సిలిండర్‌ అయితే మీ ఇంటి వద్దకే వచ్చేస్తుంది. 1800224344 నెంబర్‌కు కాల్ చేస్తే రెండు గంటల్లోనే మీ ఇంటికి డెలివరీ చేస్తారు . అయితే రూ.25 డెలివరీ ఛార్జీ కట్టాల్సి ఉంటుంది. ఇక హెచ్ పీ గ్యాస్ అప్పు పేరుతో 5 కేజీ ల సిలిండర్ ప్రవేశపెట్టింది. పెట్రోల్ బంక్‌లు, విక్రయ కేంద్రాలు, కిరాణా దుకాణాల్లో దీనిని పొందవచ్చు.

Search
Categories
Read More
Telangana
హిందీ పరీక్షకు 100% హాజరు
రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్...
By Katiyala JeevanRaj 2026-03-18 11:03:46 0 897
Andhra Pradesh
శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP
మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-02-14 06:32:38 0 205
SURAKSHA
Deepak Kumar, IPS: Championing Security with Excellence
A Distinguished IPS Officer Strengthening Internal Security, Police Reforms, and Public Trust in...
By Lokeshwari Panthadi 2026-07-17 09:58:22 0 123
Andhra Pradesh
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,...
By Kothuru Murali 2026-03-27 14:48:50 0 204
Andhra Pradesh
పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడుకోలు
*ఎన్. టి. ఆర్ .జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*   *పత్రికా...
By Rajini Kumari 2026-05-30 12:16:05 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com