గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులు.. పరారీలో మరో ఇద్దరు

0
189

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా,విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పట్టుకుని,వారి వద్ద నుంచి గంజాయి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్ పోలీసు సిబ్బందితో కలిసి బీ పవర్ హౌస్ టర్నింగ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా,బోరే కిషన్ (26), రామగుండం, లింగంపల్లి శ్రావణ్ కుమార్ (26), ఇందిరమ్మ కాలనీ, ఎన్టీపీసీ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, గంజాయిని కొనుగోలు చేసి కొంత వినియోగించడంతో పాటు మిగిలిన గంజాయిని ఎన్టీపీసీ ప్రాంతంలో కూలీ పనులు చేసే ఇతర రాష్ట్రాల కార్మికులకు విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నారు.పంచుల సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద ఉన్న బ్యాగులో 748 గ్రాముల గంజాయి లభ్యమైంది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.37,500/- గా అంచనా వేశారు. అలాగే నేరానికి ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమరవాణాను అడ్డుకుని, చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎన్టీపీసీ ఎస్ఐ టి.ఉదయ్ కిరణ్ మరియు పోలీసు సిబ్బందిని ఏసీపీ గోదావరిఖని ఎం.రమేష్, రామగుండం సీఐ కృష్ణకుమార్తో పాటు ఉన్నతాధికారులు అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: హత్య కేసులో నిందితుల అరెస్టు కోరుతూ ధర్నా.
మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు...
By Pagadala Venkateswar 2026-04-29 04:56:45 0 123
Andhra Pradesh
జాతీయ పశు ఆరోగ్య శిబిరం రైతులందరూ సద్వినియోగం చేయాలి.
ఈనెల 19 నుంచి 31 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్లు...
By Pagadala Venkateswar 2026-01-20 06:20:45 0 227
Andhra Pradesh
ఏపీ టెన్త్ రిజల్ట్స్... నారా లోకేష్ పై పవన్ కల్యాణ్ ప్రశంసలు.
పదో తరగతి ఉత్తీర్ణులకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వ సంస్కరణల వల్లే మెరుగైన...
By Pagadala Venkateswar 2026-05-02 04:18:22 0 122
Telangana
ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయం శంకుస్థాపన . |
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : కూకట్పల్లిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్...
By Sidhu Maroju 2026-01-12 06:24:55 0 266
Andhra Pradesh
పుంగనూరు మార్కెట్ యార్డ్కు తాళం వేసిన రైతులు
శనివారం రాత్రి పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో లారీ డ్రైవర్లు, మిట్ట చీమనపల్లికి చెందిన...
By Kothuru Murali 2026-05-31 16:27:36 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com