హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.

0
137

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘటన

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం

ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో చెలరేగిన మంటలు

డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

నల్లగొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

 

వివరాల్లోకి వెళితే... చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారి 65పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రయాణిస్తుండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులను వెంటనే కిందకు దిగిపోవాలని హెచ్చరించారు.

 

ప్రయాణికులు కిందకు దిగిన కొద్ది నిమిషాలకే మంటలు వేగంగా వ్యాపించి బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. చూస్తుండగానే బస్సు మంటల్లో కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

 

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపమే ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
పశ్చిమ బెంగాల్ నేల మార్పు కోరుకుంది.. అస్సాం స్థిరత్వాన్ని ఎంచుకుంది.. పుదుచ్చేరి కూటమిశక్తికి...
By Sadaq Sadaq 2026-05-05 07:45:12 0 170
Telangana
శ్రీ లక్ష్మీనగర్‌లో సీసీ రోడ్ల పనుల పరిశీలన.|
"కాలనీ అధ్యక్షుడి వినతితో రూ.51 లక్షల నిధులు.. ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణం" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-13 09:06:12 0 126
Telangana
కరీంనగర్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..!
కరీంనగర్ : మహాత్మా జ్యోతిరావు పూలే   జయంతి ఘనంగా శాతవాహన యూనివర్సిటీ లో జరిగింది.. ఈ...
By Sunka Santhosh 2026-04-11 09:51:01 0 278
Andhra Pradesh
పూర్వ విద్యార్థి స్కూలుకు మోటర్ వితరణ
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ...
By Kothuru Murali 2025-12-28 09:25:23 0 231
SURAKSHA
ప్రమాద రహిత రోడ్లే లక్ష్యం: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు నిరంతరం తనిఖీలు...
By Kalaga Sailaja 2026-06-25 06:47:13 0 87
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com