"బక్రీద్‌కు కట్టుదిట్టమైన భద్రత.. శాంతియుత వేడుకలకు సీపీ సుమతి పిలుపు”|

0
317

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ పిలుపునిచ్చారు. 

పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు.

బక్రీద్ పండుగ నేపథ్యంలో నేరేడ్మెట్‌లోని సీపీ కార్యాలయంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో మల్కాజిగిరి మున్సిపాలిటీ, వెటర్నరీ, రెవెన్యూ, వాటర్ వర్క్స్, ఫైర్, మెడికల్, రోడ్డు రవాణా శాఖల ప్రతినిధులతో పాటు ముస్లిం మత పెద్దలు, గోరక్షక్ సభ్యులు విడివిడిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బక్రీద్ వంటి పండుగలను పరస్పర సహకారంతో, సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవడం సమాజ ఐక్యతకు ప్రతీక అని అన్నారు. పండుగ రోజుల్లో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

అనుమానాస్పద వాహనాలు, అక్రమ రవాణా లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని హెచ్చరించారు.

గోవులను తరలించే వాహనాలను అడ్డుకోవడం, వ్యక్తులపై దాడులు చేయడం లేదా బలవంతంగా తనిఖీలు నిర్వహించడం వంటి చర్యలకు పాల్పడరాదని గోరక్షక్ సభ్యులకు సూచించారు.

అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాల్లోనే జంతువధ నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో జంతు అవశేషాలు వేయకుండా పరిశుభ్రత పాటిస్తూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు.

ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ అనురాధ ఐపీఎస్, మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్, ఉప్పల్ డీసీపీ సురేష్, ఎస్బీ డీసీపీ జి. నరసింహారెడ్డి, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, హెడ్‌క్వార్టర్ డీసీపీ శ్యాంసుందర్, అదనపు డీసీపీలు తదితర అధికారులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు ఐటిడిఏ ముందు గిరిజనుల ధర్నా!
పోలవరం జిల్లా కేంద్ర రంపచోడవరంలో ఈరోజు  గిరజన చట్టాల సాధనకై జరుగుతున్న మహాగర్జన సభకు...
By Shyamala Yadagiri 2026-07-20 06:59:43 0 193
Andhra Pradesh
పుంగనూరులో టిటిడి ఆధ్వర్యంలో వైభవంగా గరుడ సేవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి...
By Kothuru Murali 2026-01-05 13:17:22 0 216
Telangana
మంచిర్యాల: మాదిక దవ్యాలు కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
అంతర్జాతీయ మాదికి దవ్యాల నిరోధిక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి...
By Bonagiri RaviShankar 2026-06-26 08:37:18 0 251
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10:30 గంటలకు వేలం.
పుంగనూరు పట్టణంలోని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను...
By Kothuru Murali 2026-03-15 10:17:50 0 203
SURAKSHA
Tamil Nadu Police Green Drive Plants Thousands of Trees Every Year
Tamil Nadu Police contributes to environment through tree plantation drives. Officers and...
By Kalaga Sailaja 2026-07-02 08:20:04 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com