ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*

0
296

ప్రెస్ రిలీజ్ 

మే 20, బుధవారం

మహబూబాబాద్ జిల్లా, 

 

 

*ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లు,తరలింపు,*

 

*మక్కజొన్నలు 82వేల 363.900 మెట్రిక్ టన్నులు, 16 లక్షల 47వేల 278 బస్తాల తరలింపు,*

 

*ధాన్యం 89వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు, 73 వేల మెట్రిక్ టన్నుల తరలింపు,*

 

*స్వయంగా పర్యటిస్తూ ప్రత్యేక అధికారులకు సూచనలు జారీ చేస్తూ నిరంతరం రైతులకు అందుబాటులో జిల్లా కలెక్టర్, యంత్రాంగం

 

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే విధులలో తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటాం,

 

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్,

 

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో కలెక్టర్ నుంచి కిందిస్థాయి అధికారి వరకు ఆకస్మికంగా పర్యటనల ద్వారా రికార్డు స్థాయిలో జిల్లాలో మక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో పక్కా ప్రణాళిక అమలు చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొని గత వారం రోజుల్లో 13 వేల 434 మంది రైతుల (214) కేంద్రాల నుండి 97 వేల 246 మెట్రిక్ టన్నుల ధాన్యంకు గాను 89వేల టన్నుల ధాన్యాన్ని సేకరించి,73 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించడం జరిగింది.

ప్రాథమిక సహకార సొసైటీ, ఐకెపి, గిరిజన కార్పొరేషన్, మెప్మాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియను పూర్తిగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పర్యవేక్షిస్తూ అధిక హమాలీలను, లారీలను, ట్రాక్టర్స్, ఏర్పాటుచేసి పరిసర ప్రాంతాలలో ఉన్న మిల్లులు గోదాములలోకి తరలించడం కోసం జిల్లా యంత్రాంగం తో పాటు పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేసిందని, ప్రతి కేంద్రంలో అన్ని మౌలిక వసతులు త్రాగునీరు, టెంట్ లు, చేర్లు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతూ, రవాణా చేయు సందర్భములలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ విధంగా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు,మక్కజొన్నలు జిల్లా లక్ష్యం 1 లక్ష, 37వేల 910 మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు 82 వేల 363 .900 మెట్రిక్ టన్నుల మక్కజొన్నలు 16వేల 059 మంది రైతుల నుండి 16 లక్షల 47 వేల 278 మక్కల బ్యాగులను ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కొనుగోలను చేసి తరలించడం జరిగింది, రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లా లో మార్క్ఫెడ్, సంబంధిత అధికారులతో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అటు సెంటర్ నిర్వాహకులు ఇటు అధికారుల తో సమన్వయపరుస్తూ కొనుగోళ్లలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

 

రానున్న వారం రోజుల్లో పూర్తిస్థాయిలో మక్క జొన్న, ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పూర్తి చేయుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ముగిసిన గంగమ్మ జాతర
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ప్రారంభమైన గంగ జాతర బుధవారం రాత్రి...
By Kothuru Murali 2026-04-09 07:36:50 0 163
Telangana
బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ వైద్యాధికారి డాక్టర్ నాగేంద్రకు ఘన సన్మానం
🎤భారత్ ఆవాజ్, కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జగదీష్: కొమురం భీం ఆసిఫాబాద్ నూతన వైద్య ఆరోగ్య శాఖ...
By Chunarkar Jagadeesh 2026-08-11 16:25:48 0 191
Telangana
నిజామాబాద్
రాత్రి కురిసిన వర్షానికి ఈరోజు డివిజన్లో పర్యటించి, మైనర్ వర్క్స్ ని క్లియర్ చేయించి, మెయిన్...
By Sadaq Sadaq 2026-06-26 06:21:48 1 248
Andhra Pradesh
సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడాలి
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల చెరకు రైతులకు ఆధారమైన సంకిలి చక్కెర పరిశ్రమను కాపాడుకునేందుకు...
By Boiena Rajesh 2026-09-04 11:34:15 0 80
Telangana
"మచ్చబొల్లారంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఈటల రాజేందర్ సిఫార్సు."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్...
By Sidhu Maroju 2026-06-16 10:30:04 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com