స్వయంగా చేపలు కొని, గరిటె తిప్పి.. మత్స్యకార కుటుంబంతో చంద్రబాబు భోజనం.. ఫొటోలు ఇవిగో!.

0
118

కావలి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన

చేపల మార్కెట్ ను సందర్శించి స్వయంగా చేపలు కొనుగోలు చేసిన సీఎం

ఓ మత్స్యకారుడు ఇంటి చేపల కూరతో భోజనం

అందరితో పాటే కింద కూర్చుని భోజనం చేసిన చంద్రబాబు

ఆనందంతో పొంగిపోయిన మత్స్యకారుడి కుటుంబం  

ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్‌లో చేపలు కొని, వారింటికి తీసుకెళ్లి, వంట చేస్తుండగా సరదాగా గరిటె తిప్పారు. ఆపై ఆ కుటుంబ సభ్యులతో కలిసి కింద కూర్చుని భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికర ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తుమ్మలపెంట గ్రామానికి వెళ్లారు. అక్కడ 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్థానిక చేపల మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి మహిళా వ్యాపారుల నుంచి చేపలు కొనుగోలు చేశారు.

 

అనంతరం, మార్కెట్‌లో పరిచయమైన మత్స్యకారుడు తానంగారి బాబు ఆహ్వానం మేరకు సీఎం ఆయన ఇంటికి వెళ్లారు. తాను తెచ్చిన చేపలను వండమని తానంగారి బాబు భార్య వెంకమ్మకు ఇచ్చారు. ఆమె చేపల పులుసు వండుతుండగా, చంద్రబాబు అక్కడే ఉండి ఆసక్తిగా గమనించారు. కొద్దిసేపు ఆయన కూడా గరిటె తిప్పారు. వంట పూర్తయ్యాక, సీఎం చంద్రబాబు వారి కుటుంబ సభ్యులతో కలిసి కిందనే కూర్చుని భోజనం చేశారు. తన చేతులతో వారికి చేపల పులుసు వడ్డించడం విశేషం. తమ ఇంటికి వచ్చి, తమతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రికి తానంగారి బాబు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Search
Categories
Read More
Telangana
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ హేమ దుర్గా భవన్ లో ఈరోజు భారత జాతీయ కాంగ్రెస్...
By Jagadeesh Babu 2026-06-19 15:22:22 0 303
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలిసినటువంటి అనంతపురం గంగమ్మ తల్లిని దర్శించుకుని...
By Benguluri Madhubabu 2026-01-22 11:38:04 0 340
Telangana
యుద్ధ ప్రాతిపదికన హైటెన్షన్ రోడ్డు పనులు - పరిశీలించిన మైనంపల్లి .|
మేడ్చల్ మల్కాజ్గిరి  జిల్లా :  అల్వాల్ సర్కిల్ ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు...
By Sidhu Maroju 2026-02-21 14:00:25 0 244
Andhra Pradesh
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు  కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు ,...
By Gadiyapudi Narendra 2026-01-07 10:07:30 0 263
Andhra Pradesh
అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్.
అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్ 30-04-2026 Thu 22:42 | Andhra Nara Lokesh...
By Pagadala Venkateswar 2026-05-01 04:18:37 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com