హైదరాబాద్ కా పైచాన్ !పెహల్వాన్ తెలంగాణ కేసరి విజేతలను ఘన సన్మానంచిన : మంత్రి వివేక్ వెంకటస్వామి

0
214

హైదరాబాద్, మే 12 : గతంలో హైదరాబాద్ కా పైచాన్ అంటే హైదరాబాద్ కా పెహల్వాన్ అనే పేరు ఉండేది” అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. సరైన అవకాశాలు లేకపోవడంతో ఎంతో ప్రతిభ కలిగిన కుస్తీ క్రీడాకారులు తమ ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించలేకపోయారని పేర్కొన్నారు.ఇటీవల ఎల్బీ స్టేడియంలో మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కేసరి–2026 కుస్తీ పోటీలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం పెహల్వాన్లకు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని తెలిపారు. కుస్తీ క్రీడలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి అంజన్ కుమార్ యాదవ్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అంజన్ కుమార్ యాదవ్ కూడా ఒక మంచి పెహల్వాన్అని పేర్కొన్నారు.వ్యాయామశాలల సంస్కృతి ఒకప్పుడు హైదరాబాద్‌లో ఎంతో బలంగా ఉండేదని గుర్తు చేసుకుంటూ, తన తండ్రి కాకా వెంకటస్వామి కూడా వ్యాయామశాలకు వెళ్లేవారని మంత్రి తెలిపారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయని అన్నారు.పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులను అభినందించిన మంత్రి, వారు మరింత శిక్షణ తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, నిర్వాహకులు, కుస్తీ అభిమానులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం...
By Pagadala Venkateswar 2026-03-10 11:53:32 0 350
SURAKSHA
Shri K. V. Murali Krishna, IPS: A Quiet Guardian of Integrity and Public Service in Andhra Pradesh
From Dedicated Police Service to the Indian Police Service—A Journey Defined by Commitment,...
By Kalaga Sailaja 2026-07-14 07:23:30 0 255
Telangana
హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ !
రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో భూములను కోల్పోయిన వారికి సరైన...
By Ponnala Srinivasrao 2026-03-24 02:18:32 0 225
Andhra Pradesh
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులు పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు
మదనపల్లిలో చిన్నారి రిషిక కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ...
By Benguluri Madhubabu 2026-02-18 03:42:28 0 291
Andhra Pradesh
ఘనంగా ప్రారంభమైన సోమేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన
*స్క్రోలింగ్ కొరకు*   ఆచంట 21-12-2025     ➖ *ఘనంగా ప్రారంభమైన ఆచంట...
By Rajini Kumari 2025-12-21 14:04:18 0 281
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com