బండి సంజయ్ గారూ.. ‎మీ ధర్మం ఏమైంది? ఈ దేశం ఎటు పోతోంది? : ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి సూటి ప్రశ్న

0
211

మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయడం లేదని శాసన మండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రతిరోజూ దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్నానని చెప్పే కేంద్రమంత్రి, తన కుమారుడు అఘాయిత్యం చేస్తే ఏమీ జరగలేదని వెనకేసుకురావడం దారుణమన్నారు. పైగా ఇంత జరిగాక కూడా ఆయన ఏమీ ఎరుగనట్లు ప్రధాని సభలో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. 'బేటీ బచావో' అంటూ నినాదాలిస్తూ నీతి వాక్యాలు పలికే బీజేపీ నేతలు, తమ కేంద్రమంత్రి ఒక మైనర్ ఆడపిల్ల పట్ల చేస్తున్న కుట్రలను ఖండించాలన్నారు.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కుమ్మక్కై ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తాయని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని, ఈ ఘటనపై న్యాయం కోసం ఉద్యమించి, దేశవ్యాప్తంగా అన్నిపక్షాల మద్దతు కూడగడుతుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
హైస్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు...
By BABJI DADALA 2026-02-17 11:58:01 0 582
Andhra Pradesh
పుంగనూరు: అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు
ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఇన్చార్జి స్టేషన్ ఫైర్...
By Kothuru Murali 2026-04-19 11:08:54 0 132
Andhra Pradesh
రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా గారు
రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి...
By Chennaiah Kati 2026-06-27 03:34:22 0 124
Andhra Pradesh
రొంపిచర్ల మండలంలో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎస్ఐ మధుసూదన్ ఆధ్వర్యంలో కార్డన్...
By Kothuru Murali 2026-04-26 10:38:46 0 117
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు
పుంగనూరు మండలం, పూజాగానిపల్లి మలుపు వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న సూర్యచంద్రరావు (87) ను పుంగనూరు...
By Kothuru Murali 2025-12-29 13:52:25 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com