ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య

0
780

నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం మరియు గ్రామీణ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్‌గా అమలవుతున్నాయని పేర్కొన్నారు.

అంబారుపేట గ్రామంలో గత రెండేళ్ల కాలంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.60 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. గ్రామంలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు రూ.4.5 కోట్ల వ్యయంతో సబ్ స్టేషన్ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని తెలిపారు. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం గ్రామాభివృద్ధి, మహిళా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో అంబారుపేట గ్రామ శ్రీ సత్తెమ్మ తల్లి దేవస్థాన కమిటీ చైర్మన్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Prop News
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman Your Real Estate Companion with a Mission. In...
By Bharat Aawaz 2025-06-26 05:53:13 0 2K
Telangana
కైతలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను స్థానిక నిరుపేదలు, విలేకరులకు కేటాయించాలి: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్, మే 30: కూకట్పల్లి నియోజకవర్గంలోని కైతలాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్...
By Jagadeesh Babu 2026-05-30 16:04:41 0 350
Andhra Pradesh
నేడు మా ఘ పౌర్ణమి
ఈ నెల  19నుంచి  మాఘ పౌర్ణమి స్నా నా లు మొదులు అయి ఫిబ్రవరి 16 వరకు  పూర్తి...
By Mobbu Venkatramana 2026-02-01 10:29:58 0 507
Telangana
భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళి : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1949 నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగాన్ని...
By Sidhu Maroju 2025-11-26 06:46:55 0 214
Andhra Pradesh
పుంగనూరునియోజకవర్గం : ఉజ్వల్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, బూరగమంద సచివాలయంలో ఎమ్మార్వో ప్రమీల ఆధ్వర్యంలో పిఎం...
By Kothuru Murali 2026-02-12 14:10:06 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com