Anam Ramanarayana Reddy: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మంత్రి ఆనం.

0
360

2014 నుంచి పక్కాగా సాగుతున్న టెండర్ల వ్యవస్థను తుంగలో తొక్కారన్న ఆనం

నిబంధనలను ఐదు నెలల వ్యవధిలోనే సడలించారని విమర్శ

భోలేబాబా, వైష్ణవి వంటి సంస్థలు లబ్ధి పొందాయన్న మంత్రి

 

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కల్తీ కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని, గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను ఉద్దేశపూర్వకంగా తుంగలో తొక్కడం వల్లే ఈ అపవిత్రత చోటుచేసుకుందని ఆయన విశ్లేషించారు. 

 

 

2014 నుంచి పక్కాగా సాగుతున్న ఈ-టెండర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం 2020లో పూర్తిగా నీరుగార్చిందని మంత్రి ఆరోపించారు. నెయ్యి సేకరణలో అత్యంత కఠినంగా ఉండాల్సిన నిబంధనలను కేవలం ఐదు నెలల వ్యవధిలోనే సడలించడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆవు పాల ఉత్పత్తి ప్రమాణాలను తగ్గించారని ఆరోపించారు.

 

 

గత ప్రభుత్వ నిర్ణయాలు భోలేబాబా, వైష్ణవి వంటి నిర్దిష్ట డెయిరీలకు భారీగా లబ్ధి చేకూర్చాయని ఆనం వివరించారు. బిడ్డర్ల సంఖ్యను పెంచుతున్నామనే సాకుతో నిబంధనలు మార్చినప్పటికీ, వాస్తవానికి బిడ్డర్లు పెరగలేదని, కేవలం అనుభవంలేని కొన్ని సంస్థలు తక్కువ ధర కోట్ చేసి కాంట్రాక్టులు దక్కించుకునేలా మార్గం సుగమం చేశారని ఆయన విమర్శించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టిడిపి కార్యాలయంలో ఘన నివాళులు సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు కార్యాలయంలో మహాత్మ...
By Benguluri Madhubabu 2026-04-11 13:21:21 0 200
Andhra Pradesh
కూటమి ప్రభుత్వంలో ప్రాణాంతకంగా మారిన పాలు
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని...
By Boiena Rajesh 2026-02-28 11:45:17 0 230
Telangana
"బస్తీల బాట పట్టిన ఎమ్మెల్యే శ్రీగణేష్.. నవ కంటోన్మెంట్ లక్ష్యంగా క్షేత్రస్థాయి పర్యటన".|
మేడ్చల్–మల్కాజిగిరి : జిల్లాలో నవ కంటోన్మెంట్ నిర్మాణ లక్ష్యంతో అభివృద్ధి పనులకు మరింత వేగం...
By Sidhu Maroju 2026-06-03 09:34:56 0 264
Andhra Pradesh
AP New Scheme: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. మరో కొత్త పథకం ప్రారంభానికి రెడీ.. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు సిద్దమైంది. గరుడ పేరుతో కొత్త...
By Pagadala Venkateswar 2026-01-13 12:00:59 0 238
Andhra Pradesh
మదనపల్లి: నేడు విద్యార్థులకు అవగాహన సదస్సు.
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు గురువారం సర్వోదయ డి...
By Pagadala Venkateswar 2026-02-12 04:43:02 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com