ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ : కుమార్ దీపక్ ఐఏఎస్

0
249

మంచిర్యాల :ఈరోజు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సురక్షిత మాతృత్వం కార్యక్రమం జిల్లా మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ మంచిర్యాల పురపాలక మేయర్ శ్రీ ధరణి మధుకర్ డిప్యూటీ మేయర్ శ్రీమతి సల్ల రమ్య మహేష్ స్థానిక కార్పొరేటర్ మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఆర్ఎంవోలు డాక్టర్ శ్రీధర్ డాక్టర్ శ్రీమన్నారాయణ డాక్టర్ గరుడ లక్ష్మి డాక్టర్ అరుణ శ్రీ జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ ప్రారంభించినారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలు మరియు సురక్షిత మాతృత్వం పైన ఈరోజు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రజలలో అవగాహన కలిగించడానికి కరపత్రాలను విడుదల చేయడం జరిగినది అదేవిధంగా జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో వైద్యులు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఇప్పటివరకు 4485 ప్రసవాలను చేసినట్లు ఇందులో 1870 సాధారణ ప్రసవాలు చేసినట్లు చాలా హైరిస్కు ప్రభావిత గర్భవతులను మంచిర్యాల్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చేసినట్లు తెలియజేశారు అదేవిధంగా జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు కూడా సాధారణ ప్రసవాలపైన దృష్టి పెట్టాలని సాధారణ ప్రసవాలు జరిగే విధంగా తల్లులకు ఇంటి వారికి అవగాహన కలిగించాలని సాధారణ ప్రసవాలు ముద్దు సిజేరియన్లు వద్దు అని నినాదాలు తో అవగాహన కలిగించాలని ఆదేశించినారు అదే విధంగా హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు గుర్తించి వారితో డెలివరీ కోసం ప్లానింగ్ చేయాలని వారి పైన దృష్టి పెట్టాలని ఆదేశించినారు ముఖ్యంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ చిన్న వయసులో గర్భము అధిక బరువు అతి తక్కువ బరువు గతంలో నెలలు నిండకుండా ప్రసాదము కవల పిల్లలు రక్తహీనత ప్రసవానికి ముందు రక్తస్రావము మూర్చ వ్యాధి క్షయ మలేరియా మానసిక ఆరోగ్య సమస్యలు కామెర్లు సికిల్ సెల్ కలిసి మియా గుండె సమస్యలు ఫీటల్ గ్రోత్ రిటార్ రేషన్ దీర్ఘకాలిక వ్యాధులు ఇవన్నీ కూడా ఐరిస్క్ ప్రెగ్నెన్సీలు కావున వీటి పైన దృష్టి పెట్టాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలోని ఆరోగ్య ఆశా కార్యకర్తలు వైద్యులు మొట్టమొదటకు గుర్తించి సూపర్ స్పెషాలిటీ వైద్యులచే వైద్యం అందించాలని అదేవిధంగా సురక్షిత మాతృత్వం కోసం ప్రతి గర్భిణీ నాలుగు సార్లు తనిఖీలు చేయించాలని పౌష్టికాహారము పండంటి బిడ్డకు ఆధారము ఆసుపత్రి ప్రసవము అత్యవసర సేవలు 108 102 అంబులెన్స్ సర్వీసుల వినియోగము రక్త పరీక్షలు ప్రసవ అనంతరము ఆరువారాల విశ్రాంతి బిడ్డకు తల్లిపాలు పట్టించడం కుటుంబ నియంత్రణ పైన అవగాహన కలిగించడం చేయాలని ఆదేశించినారు అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటివరకు 8400 మంది గర్భవతులకు స్కానింగ్ పరీక్షలు 450 మందికి టీపా స్కాన్లు ఇతర పరీక్షలు నిర్ధారి చేసినట్లు అదేవిధంగా జిల్లాలో అత్యవసర సేవలు కూడా అందిస్తున్నట్లు తెలియజేసినారు ముఖ్యంగా జిల్లాలోని ప్రజలందరూ వైద్య ఆరోగ్యశాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను ఉపయోగించుకోవాలని కోరినారు ఈరోజు సురక్షిత మాతృత్వం పైన అదే విధంగా నవజాత శిశు సంరక్షణ కుటుంబ నియంత్రణ పద్ధతుల పైన అవగాహన కలిగించడం జరిగినది ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వైద్య శాఖ ద్వారా అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకుంటూ వైద్య సేవలు పొందాలని ఆదేశించినారు ప్రజలలో అవగాహన కలిగించాలని ముఖ్యంగా జిల్లాలో మాతా శిశు సంరక్షణ అత్యవసర కేసులకు చికిత్సలు డయాలసిస్ సెంటర్ తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ వైద్య ఆరోగ్యశాఖ నర్స్ ట్రైనింగ్ కాలేజ్ వైద్య కళాశాల మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రములు ఏరియా హాస్పిటల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ద్వారా జిల్లాలో వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ గైనకాలజిస్ట్ హెచ్ ఓ డి డాక్టర్ గరుడ లక్ష్మి డాక్టర్ ప్రియదర్శిని డాక్టర్ అల్లాడి శ్రీనివాస్ నామ్దేవ్ శ్రీనివాస్ ఆర్ఎస్ పద్మ వైద్య కళాశాల సిబ్బంది నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఆశ ఆరోగ్య కార్యకర్తలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది వైద్యులు మాతా శిశు పైన పనిచేస్తున్న కృషి ఎన్జీవో ద్వారా గర్భవతులకు పండ్లు అందించారు ఈ అవగాహన కార్యక్రమాలను మార్ముల ప్రాంతాలకు చేరే విధంగా చర్యలు చేపట్టాలి అని ఆదేశించారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: ఉచిత కన్ టి వైద్యశిబిరం
నగరంలోని ఇందిరా ప్రియదర్శిని నగర్ కాలనీలోని .సూర్యసమైక్య సంఘం లో జనసేన 12 వ ఆవిర్భావం సందర్బంగా...
By Sadaq Sadaq 2026-03-14 09:26:40 0 233
Telangana
"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన...
By Sidhu Maroju 2026-04-16 07:10:14 0 352
Andhra Pradesh
ఆయుష్ శాఖ లో ఉద్యోగిని పదవి విరమణ
   విశాఖ పట్నం  జిల్లా  ఆనంద పురం మండలం శొంఠి యం  ఆయుష్  ఆసుపత్రి...
By Mobbu Venkatramana 2026-02-28 07:11:55 0 297
Andhra Pradesh
పుంగనూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ...
By Kothuru Murali 2026-04-30 11:24:21 0 135
Andhra Pradesh
శ్రద్ధాంజలి ఘటించిన రవాణా శాఖ మంత్రి
కరిమిరెడ్డి ప్రీతి మృతదేహానికి నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-01-14 07:54:50 1 950
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com