చింతూరులో వీధి కుక్కల బీభత్సం.

0
206

చింతూరు పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూగజీవాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి ముఖ్యంగా ఆవులపై గుంపులు గుంపులుగా దాడి చేస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం గత పది రోజుల క్రితమే ఒక తల్లి ఆవుపై దాడి చేసిన కుక్కల మంద, దాన్ని చంపి తినేశాయి. ఆ ఘటన మరువక ముందే, తాజాగా ఆ తల్లి ఆవు దూడను కూడా అదే రీతిలో చంపి తినేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. కుక్కలు మృగాల్లా మారి ఇలా వరుసగా పశువులపై దాడులు చేస్తుండటంతో అటు పశుపోషకులు వణికిపోతున్నారు ఆవులపై ఈ కుక్కల గుంపులు పడి, వాటిని పీక్కుతింటున్న వైనం స్థానికులను కలచివేస్తోంది.కుక్కల బెడద రోజురోజుకూ మితిమీరిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, ఈ కుక్కల స్వైర విహారానికి అడ్డుకట్ట వేయాలని, ప్రజల ప్రాణాలకు, పశువులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో సరికొత్త సైజుల్లో మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి!
కొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి 150ml, 200ml సీసాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు...
By Pagadala Venkateswar 2026-06-03 11:32:54 0 94
Telangana
గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన  నీలం స్వరూప కుమారుడు క్రాంతి నూతన...
By Pindikura Mahesh 2026-06-26 03:06:35 0 427
International
PM Narendra Modi held wide-ranging talks with President John Dramani Mahama of Ghana at the iconic Jubilee House, Ghana......
Both leaders reaffirmed the warm and time-tested ties between 🇮🇳 & 🇬🇭, and discussed ways to...
By Bharat Aawaz 2025-07-03 07:24:41 0 2K
Andhra Pradesh
National Road Safety Month
As part of the 37th National Road Safety Month, a "National Road Safety Walkathon" was organized...
By Terli Ashok 2026-01-25 05:22:18 0 330
Andhra Pradesh
రచ్చ బండ
ప్రస్తుత కాలంలో పూర్వం గ్రామాలలో.రచ్చబండ ల దగ్గర .చెట్ల క్రింద వివిధ సమస్యల పైన రాజకీయ పరిపాలన...
By Mobbu Venkatramana 2026-03-05 13:35:58 0 344
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com