దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన

0
164

కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ C.V. Anand గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ,పాడి కౌశిక్ రెడ్డి గారు కేపీ వివేకానంద గారు ,కల్వకుంట్ల సంజయ్ గారు ,ముఠా గోపాల్గారు,కాలేరు వెంకటేష్ గారు ఎంఎల్సీ లు దేశపతి శ్రీనివాస్ మరియు దాసోజు శ్రవణ్ కలిసి వినతిపత్రం అందజేశారు.

‎ఇటీవల కరీంనగర్‌లో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, గుంపులుగా తిరుగుతూ భయాందోళనలు సృష్టిస్తున్న సంఘటనలు నగరంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.

‎ప్రత్యేకంగా ఎమ్మెల్యే Padi Kaushik Reddy గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నేతలు… ఇది సాధారణ ఘటన కాదని, రాజకీయ కక్షతో బీజేపీ గుండాలు పన్నిన కుట్ర అని ఆరోపించారు. ఈ దాడుల వెనుక Bandi Sanjay Kumar ప్రేరణ స్పష్టంగా కనిపిస్తోందని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

‎అంతేకాకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడులు, కార్ల ధ్వంసం, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని భయానక వాతావరణం సృష్టించడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని మండిపడ్డారు. కరీంనగర్ ప్రజలు భయంతో జీవించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

‎శాంతిభద్రతలను కాపాడడంలో పూర్తిగా విఫలమైన కరీంనగర్ సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన టూ టౌన్ సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

‎అదేవిధంగా ఎమ్మెల్యే Padi Kaushik Reddy గారిపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై, అలాగే ప్రేరేపించిన Bandi Sanjay Kumar పై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

‎ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్ బైపాస్ రోడ్డులో రేపు ప్రారంభం కానున్న PAIDE Conventionను నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు నేడు సందర్శించారు.
PAIDE Convention యజమాని, ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారి సోదరుడు శ్రీ పైడి రాజ...
By Sadaq Sadaq 2026-08-20 16:35:40 0 121
SURAKSHA
Architect of Governance: The Legacy of Shri Vineet Garg, IAS
Administrative Excellence: How Three Decades of Visionary Governance is Shaping Haryana’s...
By Kalaga Sailaja 2026-07-20 08:02:04 0 385
Andhra Pradesh
చీరాల అన్నా క్యాంటీన్‌కు రెండవ స్థానం – ప్రతిష్ఠాత్మక విజయం
చీరాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న అన్నా క్యాంటీన్ పథకం ద్వారా...
By Gadiyapudi Narendra 2026-02-18 16:37:52 0 237
Andhra Pradesh
శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-03-15 10:51:28 0 288
Telangana
సందిగ్ధంలో అజారుద్దీన్ మంత్రి పదవి.|
హైదరాబాద్ : ఎమ్మెల్సీ కేసు పెండింగ్‌లో ఉండగా, కోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్న అజారుద్దీన్...
By Sidhu Maroju 2025-12-26 09:42:04 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com