తెలంగాణలో రియల్ ఎస్టేట్‌పై ‘విలువల’ భారం.. భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు!

0
197

తెలంగాణలో స్థిరాస్తి కొనుగోలుదారులపై త్వరలో భారీ భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను (రిజిస్ట్రేషన్ విలువ) గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ పెంపుదల కనిష్టంగా 20 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు, కొన్ని కీలక ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక విలువలకు, వాస్తవ మార్కెట్ ధరలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించి, తద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం.

‎గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించలేదు. ఈ నేపథ్యంలో, 2025-26 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.19,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, విలువల సవరణ ద్వారానే ఇది సాధ్యమని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.15,200 కోట్లుగా ఉంది. మొదట హైదరాబాద్ నగర పరిధిలోనే ఈ పెంపును పరిమితం చేయాలని భావించినప్పటికీ, తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములన్నింటికీ వర్తింపజేయాలని నిర్ణయించారు.

‎పశ్చిమ హైదరాబాద్‌లో భారీగా పెంపు!

‎ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లావాదేవీలు అధికంగా ఉండే పశ్చిమ హైదరాబాద్‌లోని ప్రాంతాల్లో విలువల పెంపు భారీగా ఉండనుంది. కోకాపేట, గండిపేట, మోకిల, గచ్చిబౌలి, గోపన్‌పల్లి, నానక్‌రామ్‌గూడ, రాజేంద్రనగర్, బుడ్వేల్ వంటి ప్రాంతాల్లో ఈ పెరుగుదల 100% దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉదాహరణకు, కోకాపేటలో ప్రభుత్వం వేలంలో ఎకరం భూమిని రూ.100 కోట్లకు పైగా ధరకు విక్రయించింది. ఇక్కడ డెవలపర్లు ఫ్లాట్లను చదరపు అడుగుకు రూ.12,000 వరకు అమ్ముతుంటే, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ మాత్రం కేవలం రూ.3,000 గానే ఉంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

‎అదేవిధంగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ల మార్కెట్ ధర చదరపు గజానికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతుండగా, ప్రభుత్వ విలువ రెసిడెన్షియల్ ప్లాట్లకు కేవలం రూ.13,500, కమర్షియల్‌కు రూ.23,800 గానే ఉంది. బాచుపల్లిలో మార్కెట్ ధర చదరపు గజానికి రూ.70,000-రూ.80,000 ఉండగా, ప్రభుత్వ విలువ రూ.12,600 మాత్రమే. గచ్చిబౌలి, మాదాపూర్‌లలో చదరపు అడుగుకు ప్రభుత్వ విలువ రూ.3,000-రూ.4,500 ఉండగా, మార్కెట్ ధరలు దీనికి చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

‎రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం

‎హైదరాబాద్‌లోని తూర్పు ప్రాంతాలైన విజయవాడ హైవే వెంబడి చౌటుప్పల్ వరకు, వరంగల్ హైవే వెంబడి యాదగిరిగుట్ట వరకు సుమారు 20 శాతం పెరుగుదల ఉండవచ్చని అంచనా. ఇక వ్యవసాయ భూముల విషయంలోనూ భారీ వ్యత్యాసం ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని మారుమూల గ్రామాల్లో కూడా ఎకరం భూమి మార్కెట్ ధర రూ.20-30 లక్షలు పలుకుతుంటే, ప్రభుత్వ విలువ మాత్రం కేవలం రూ.5 లక్షలుగానే నమోదై ఉంది. ఈ వ్యత్యాసాలన్నింటినీ సవరించనున్నారు.

‎విలువల పెంపు నేరుగా కొనుగోలుదారులపై ప్రభావం చూపుతుంది. పట్టణ ప్రాంతాల్లో 6%, గ్రామీణ ప్రాంతాల్లో 7.5 శాతంగా ఉన్న స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిన విలువల ఆధారంగా లెక్కిస్తారు. దీంతో ఆస్తి రిజిస్ట్రేషన్ ఖర్చు గణనీయంగా పెరగనుంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని అధికారులు చెబుతున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
కలల ప్రమాణం.. కన్నీటి ప్రయాణం
అంగరంగ వైభవంగా వివాహం..జీవితాంతం కలసి సాగుతామన్న ప్రమాణం అన్యోన్యంగా సాగుతున్న జీవితం తొమ్మిది...
By SivaNagendra Annapareddy 2025-12-13 05:31:30 0 361
Telangana
సింగరేణిలో అగ్గి పుట్టిస్తాం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన...
By Avunoori Mahesh 2026-04-12 12:29:18 0 221
Andhra Pradesh
ఈ రోజు బాపట్ల టౌన్ ఫ్లైఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసీన బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున ,బాపట్ల నియోజకవర్గం ఇంచార్జి కోన రఘుపతి
బాపట్ల: ఈ రోజు బాపట్ల జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం...
By Gadiyapudi Narendra 2026-03-17 11:38:36 0 622
Andhra Pradesh
చిరువ్యాపారులకు టీడీపీ అండ: ఉచిత టార్పాలిన్ పంపిణీ
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు,...
By Kothuru Murali 2026-05-19 15:17:03 0 116
Andhra Pradesh
మా ఇంటి పెద్ద కొడుకు షార్ట్ ఫిలిం లాంచ్
*పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా 'మా ఇంటి పెద్ద కొడుకు' షార్ట్ ఫిలిం లాంచ్*    ...
By Rajini Kumari 2026-03-14 11:24:32 0 237
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com