ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికం

0
141

కరీంనగర్ జిల్లా 

‎   బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి వి రామకృష్ణ రావు నిన్నా బండి సంజయ్ కుమార్ గారు కే.టి. రామారావు (కేటీఆర్) గారిపై చేసిన అవమానకర మరియు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము.

‎>ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు విధానాలపై, ప్రజా సమస్యలపై ఉండాలి గానీ వ్యక్తిగతంగా దూషణలు చేయడం అనైతికం

‎. >కేటీఆర్ గారు కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారి కుమారుడని నిరూపించుకోవాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవి.

‎>హైదరాబాద్‌లో భూకబ్జా వ్యవహారాలపై కేటీఆర్ గారు చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వలేక, అలాగే రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపై స్పందించలేక, బండి సంజయ్ వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆయన అసహనాన్ని, బలహీనతను బయటపెడుతోంది.

‎>కాళేశ్వరం, ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై బండి సంజయ్ ఎన్నోసార్లు ఆరోపణలు చేసినప్పటికీ, కేటీఆర్ గారు ఎప్పుడూ ధైర్యంగా సమాధానాలు ఇచ్చారు. కానీ తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక బండి సంజయ్ వ్యక్తిగత దూషణలకు దిగడం దురదృష్టకరం.

‎>హిందూ ధర్మం, శ్రీ రాముడు, హనుమంతుడు పేర్లు ఎత్తుకునే బండి సంజయ్ వంటి నాయకుడు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం. >రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) వంటి సంస్థల్లో ఆయనకు ఇదే శిక్షణ ఇచ్చారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

‎>మేము నిజమైన హిందువులం. మా సంస్కృతి గౌరవాన్ని, నియంత్రణను, నైతిక విలువలను నేర్పుతుంది. మేము దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, భక్తితో పూజిస్తాము.

‎>కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, అలాగే కరీంనగర్ మాజీ ఎంపీగా బండి సంజయ్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారు.

‎>ఇలాంటి బాషా తనపై వాడితే ఎలా ఉంటుందో బండి సంజయ్ ఆలోచించాలి.

‎>వేరే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలను చూపిస్తూ తెలంగాణలో కూడా అదే ఫలితం వస్తుందని మీరు చెప్పడం వాస్తవానికి సరిపోదు. 

‎>ప్రతి రాష్ట్రానికి తనకంటూ ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు, ప్రజల అభిరుచులు ఉంటాయి.

‎>తెలంగాణలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని సంపాదించడంలో విఫలమైందని స్పష్టంగా కనిపిస్తోంది. 

‎>ఇక్కడ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం, స్పష్టమైన దిశ, బలమైన నాయకత్వం కనిపించడంలేదు. 

‎>ఈ పరిస్థితుల్లో కేవలం ఇతర రాష్ట్రాల విజయాలను చూపించడం ద్వారా ఇక్కడ గెలుస్తామని చెప్పడం మీ బుద్ధి తక్కువ తనం 

‎>ప్రజలు ఎవరికి ఓటు వేయాలో వారి పనితీరు, నిబద్ధత, ప్రజాసేవ ఆధారంగా నిర్ణయిస్తారు. 

‎>తెలంగాణలో బీజేపీకి అలాంటి బలమైన రాష్ట్రస్థాయి నాయకత్వం ఉందా? ప్రజల సమస్యలపై మీరు ఎక్కడ, ఎలా పోరాడుతున్నారో ప్రజలకు స్పష్టంగా చెప్పగలరా?

‎>ఇక్కడి రాజకీయ వాస్తవాలను అర్థం చేసుకోకుండా, ఊహాజనిత అంచనాలపై ఆధారపడి మాట్లాడడం కంటే మీరు చేసేది ఏమి లేదు 

‎>తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నారనే పేరే గానీ, రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన చరిత్ర కనిపించడంలేదు. 

‎>తెలంగాణపై అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా ఒక్కరు లేచి గళం విప్పలేకపోవడం వారి రాజకీయ బలహీనతను బయటపెడుతోంది.

‎>కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారు. >యూరియా కొరత వంటి అత్యవసర సమస్యలపై కేంద్రంతో చర్చించి పరిష్కారం తీసుకురావడం కూడా చేయలేకపోయారు. >పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, బీజేపీ నాయకులు నిశ్శబ్దంగా ఉండటం బాధ్యతారాహిత్యం.

‎>రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బలమైన ప్రతిపక్షంగా నిలబడాల్సిన చోట, బీజేపీ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజల సమస్యలపై పోరాడే ధైర్యం, నిబద్ధత ఎక్కడా కనిపించడం లేదు.

‎>ఇక్కడ బీజేపీ నాయకత్వం ప్రజలకు ఉపయోగపడే శక్తిగా కాదు, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా కూడా కనిపించడం లేదు.

‎> బండి సంజయ్ గారు పగటి కళ్ళకు కనడం అపి ప్రజలకు ఏమి చేస్తారో చెప్పండి, 

‎>కేటీఆర్ గారిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి మరియు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తన్నాము

Search
Categories
Read More
Andhra Pradesh
అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్
ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు...
By Boiena Rajesh 2026-02-26 02:19:16 0 258
Andhra Pradesh
మదనపల్లి : కోడలపై అత్తామామల దాడి.
మదనపల్లెలో బుధవారం నాడు జరిగిన ఘటనలో, నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు...
By Pagadala Venkateswar 2026-04-23 03:31:39 0 107
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో గంగ జాతర
పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో గంగ జాతరను నిర్వహిస్తున్నారు....
By Kothuru Murali 2026-03-16 07:00:46 0 154
Andhra Pradesh
Helmet averness
విజయవాడ సెంట్రల్ సీతన్న పేట గేట్ దగ్గర హెల్మెట్ ఉంది అవెర్నెస్ వాహనదారులకు సూచనలు ఇస్తున్న...
By Kokkiligadda Suresh 2026-04-28 13:32:16 0 244
Telangana
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం సంక్రాంతి పండుగ వేళ సుమారు వెయ్యి...
By Pinnehasan Odela 2026-01-15 14:31:53 0 460
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com