కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.

0
144

నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం

 జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన పోలీసులు

 సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు

పల్నాడు జిల్లా కారంపూడిలో పట్టపగలు బంగారం వ్యాపారిపై దాడి చేసి రూ.60 లక్షల విలువైన ఆభరణాలు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారం, నేరానికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను పల్నాడు ఎస్పీ బి. కృష్ణారావు మీడియాకు వెల్లడించారు.

 

వినుకొండకు చెందిన బంగారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావుపై ఇటీవల జరిగిన దోపిడీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. స్థానిక జ్యువెలరీ షాపులో పనిచేస్తున్న గోసుల శంబయ్య (27) ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి అని తేల్చారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, చెడు అలవాట్లకు బానిసైన శంబయ్య.. వ్యాపారి శ్రీనివాసరావు కదలికలపై నిఘా పెట్టాడు. ప్రతి సోమవారం శ్రీనివాసరావు ఆభరణాలతో కారంపూడికి వస్తాడని తెలుసుకుని, తన స్నేహితులతో కలిసి దోపిడీకి పక్కా ప్రణాళిక రచించాడు.

 

ప్లాన్ ప్రకారం, బండారు అజిత్ (25), కె. శశికుమార్ (22), కె. సాయికిరణ్ (24), ఎ. నిఖిల్ మహేష్ (20), జి. పవన్ (30)లతో కలిసి శంబయ్య ఈ దోపిడీకి పాల్పడ్డాడు. వ్యాపారిపై దాడి చేసి, బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును లాక్కొని బైక్‌లపై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గురజాల డీఎస్పీ మహేశ్వరరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

 

సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి, ఎన్ఎస్పీ కాలువ కట్ట వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 566.60 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన యమహా ఎంటీ-15, హీరో గ్లామర్ బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన దర్యాప్తు బృందాన్ని ఎస్పీ కృష్ణారావు అభినందించారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో తండ్రి కొడుకులకు సన్మానం చేసిన పోలీసులు
పుంగునూరు మండలం సుగాలి మిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి 10 గంటలకు జరిగిన లారీ ప్రమాదంలో,...
By Kothuru Murali 2026-06-09 13:44:00 0 121
Andhra Pradesh
పెద్దమండ్యం: 'షైనింగ్ స్టార్' అవార్డులకు విద్యార్థుల ఎంపిక!
పెద్దమండ్యం మండలం కలిచర్ల హైస్కూల్ విద్యార్థులు M. జశ్వంత్ రెడ్డి (578 మార్కులు), Y. రేవతి (513...
By Pagadala Venkateswar 2026-07-18 06:53:06 0 99
Telangana
"2BHK మోసగాళ్ల ఆటకట్టించాం: డీసీపీ శ్రీధర్"|
"2BHK మోసగాళ్లకు ఆల్వాల్ పోలీసుల చెక్.. 79 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం: డీసీపీ శ్రీధర్"  ...
By Sidhu Maroju 2026-06-25 08:24:03 0 336
Telangana
కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారి చేప మందు పంపిణీ కార్యక్రమం.
కరీంనగర్ జిల్లా టవర్ సర్కిల్లో గడియారం వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారు మృగశిర కార్తె...
By Thalakokkula Sadanandam 2026-06-09 12:22:19 0 394
Andhra Pradesh
మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నరీస్ తో లోకేష్ బేటి
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో మంత్రి లోకేష్ భేటీ   ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ...
By Rajini Kumari 2026-06-01 12:18:29 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com