"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|

0
520

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. 

మే 3. 2026. ఆదివారం ఉదయం సుమారు 10-11 గంటల సమయంలో నగరంలోని పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో వచ్చిన దుండగులు కాల్పులు జరిపి భారీగా బంగారం దోచుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 

దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు కాల్పులకు తెగబడి సిబ్బందిని అదుపులోకి తీసుకుని దోపిడీకి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. 

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ కేసుకు సంబంధించి నిందితుల ఫోటోలను కరీంనగర్ పోలీసులు అధికారికంగా విడుదల చేశారు.

పోస్టర్‌లో ఉన్న ఐదుగురు అనుమానితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.1 లక్ష నగదు బహుమతి ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ పోస్టర్‌లోని వివరాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అల్వాల్ పి‌ఎస్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. 

పోస్టర్‌లో కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సంప్రదింపు నంబర్లు కూడా ఇవ్వబడిన నేపథ్యంలో, నిందితుల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే ఆ నంబర్లకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు, లేక అత్యవసర నంబర్ 100కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

నిందితులు ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ప్రజల సహకారంతో ఈ సంచలన దోపిడీ కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నా క్యాంటీన్ తనిఖీ
విశాఖ లో కింగ్ జార్జ్ ఆసుపత్రి ఓ పీ గేట్ పక్కన గల అన్నా క్యాంటీన్ ను  బుదవారం మధ్యాహ్నం...
By Mobbu Venkatramana 2026-03-04 08:34:38 0 318
Andhra Pradesh
అనంతపురం :ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్
అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే " 𝟴𝘁𝗵 𝗦𝗛𝗢𝗥𝗧 𝗙𝗜𝗟𝗠 𝗙𝗘𝗦𝗧𝗜𝗩𝗔𝗟 " పోస్టర్ ను ఈ రోజు...
By Eslavath RameshNaik 2026-01-18 15:43:17 0 728
Telangana
బొల్లారం ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ.|
● అత్యంత భద్రత మధ్య 12 ఆయుధాలు మాయం ● ఆదివారం రాత్రి చోరీ.. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు ●...
By Sidhu Maroju 2026-09-01 15:31:20 0 100
Andhra Pradesh
Nara Lokesh: ఉత్తరాంధ్రకు మరో భారీ పరిశ్రమ.. బ్లూ జెట్ హెల్త్‌కేర్‌కు మంత్రి లోకేశ్‌ శంకుస్థాపన.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూ జెట్ హెల్త్‌కేర్ యూనిట్‌కు శంకుస్థాపన రూ.2,300 కోట్ల...
By Pagadala Venkateswar 2026-02-28 08:22:36 0 167
Andhra Pradesh
జగన్మోహన్ రెడ్డి మావిగన్ జోకర్ వైయస్ షర్మిల రెడ్డి
BREAKING   విజయవాడ    *జగన్ మోహన్ రెడ్డి “మావిగన్ జోకర్” - వైఎస్...
By Rajini Kumari 2026-04-10 06:36:44 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com