నందిగామలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య

0
369

నందిగామలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

75 మంది లబ్ధిదారులకు రూ.34.80 లక్షలు అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య 

 

నందిగామ పట్టణం పాత బస్టాండ్ సెంటర్‌లోని బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్‌లో శనివారం నాడు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కూటమి నేతలతో కలిసి 75 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.34 లక్షల 80 వేల 767 రూపాయల విలువైన చెక్కులను నేరుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను పొందిన తర్వాత సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసిన వారికి ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణమే సహాయం మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రమాదంలో కాలు కోల్పోయిన గోపి ప్రాణాలు కాపాడిన తంగిరాల సౌమ్య 

ఇటీవల చందర్లపాడు మండలం బ్రహ్మబోట్లవారి పాలెం గ్రామానికి చెందిన బుడంచర్ల గోపి మాట్లాడుతూ ప్రమాదవశాత్తు తన కాలును కోల్పోయిన ఘటనను ప్రస్తావిస్తూ, ఆయనకు వెంటనే వైద్య సహాయం అందేలా విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి తంగిరాల సౌమ్య గారు తన ప్రాణాలను కాపాడినట్లు వివరించారు. ఈ సందర్భంగా గోపి భావోద్వేగానికి లోనై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారికి తన కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Madanapalle: వారణాసిలో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన మదనపల్లె బీజేపీ నేత మిట్టా వంశీకృష్ణ. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పురస్కరించుకుని బీజేవైఎం బైక్ యాత్ర!
Madanapalle: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా, ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి...
By Pagadala Venkateswar 2026-09-19 06:32:27 0 41
SURAKSHA
Shri Utkarsha, IPS: Rising Star in Smart Policing
A young 2021-batch AGMUT cadre IPS officer, Shri Utkarsha is earning recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-20 04:58:08 0 172
Telangana
తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా శివధర్ రెడ్డి నియామకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డిజిపిగా శివధర్ రెడ్డి నియామకం. డీజిపీగా నియమిస్తూ తెలంగాణ...
By Sidhu Maroju 2025-09-26 17:33:35 0 355
Telangana
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక
తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ...
By Bharat Aawaz 2025-10-15 08:26:20 0 1K
SURAKSHA
Apoorva Chandra IAS: A Visionary Leader in Indian Administration
The Journey Begins "Good governance is measured not by promises, but by the...
By Fathima Safa 2026-07-23 07:02:34 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com