7 న సిద్ధార్థ స్వర్ణోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

0
265

7న సిద్ధార్థ స్వర్ణోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు

 

విజయవాడ, జనవరి 5 : ఈ నెల 7న సాయంత్రం విజయవాడ మొఘల్రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగే సిద్ధార్థ అకాడమి ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్వర్ణోత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని, కేంద్రమంత్రి కె. రామ్మోహననాయుడు విశిష్ట అతిథిగా విచ్చేస్తారని సిద్ధార్థ అకాడమి అధ్యక్షులు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి, పి.బి. సిద్ధార్థ కళాశాల కన్వీనర్ నిమ్మగడ్డ  లలితప్రసాద్ తెలిపారు. సోమవారం కళాశాలలోని వెబినార్ హాలులో వారు విలేకరులతో మాట్లాడుతూ 1975లో 250 మంది వదాన్యులైన ప్రముఖులు అందరికీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు విజయవాడలో నెలకొల్పిన సిద్ధార్థ అకాడమి, పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఉయ్యూరులో ఏజీ అండ్ ఎస్‌.జి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు 18 విద్యాసంస్థలుగా ఎదిగాయన్నారు. సిద్ధార్థ విద్యాసంస్థల అభివృద్ధికి ఎంతో కృషిచేసిన 8 మంది ప్రధాన దాతలను ఆరోజున కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో సత్కరిస్తామని చెప్పారు. సిద్ధార్థ స్వర్ణోత్సవాలను గత ఏడాది మార్చి 7న అప్పటి యూజీసీ ఛైర్మన్  ప్రారంభించారని చెప్పారు. స్వర్ణోత్సవాల్లో భాగంగా గత పది నెలలుగా సిద్ధార్థ విద్యాసంస్థలలో పలు సదస్సులు, సమావేశాలు, పోటీలు, సినీ సంగీత విభావరి, వైద్య,విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలు, ఆర్బీఐ పూర్వ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితరులతో అతిథి ఉపన్యాసాలు తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఎప్పటికప్పుడు ఉపాధికి దోహదపడే కొత్తకోర్సులు ప్రవేశపెడుతూ ఉన్నత విద్యకు అకాడమీ ఊతమిస్తోందన్నారు. ఈ ఐదు పదుల సుదీర్ఘ ప్రస్థానంలో విజయవాడను విద్యాకేంద్రంగా సిద్ధార్థ అకాడమీ మలచిందన్నారు. విజయవాడను సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేయడంలో సిద్ధార్థ అకాడమి కీలక భూమిక పోషించిందని, అనుబంధ విభాగంగా సిద్ధార్థ కళాపీఠం ఏర్పాటుచేసి దేశం నలుమూలల నుంచి సుప్రసిద్ధ కళాకారులను విజయవాడకు ఆహ్వానించి ఎన్నో శాస్త్రీయ సంగీత, నృత్య కార్యక్రమాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వెల్లంకి నాగభూషణం, జాయింట్ సెక్రటరీ సూరెడ్డి విష్ణు కూడా పాల్గొన్నారు.

 

 

 

Search
Categories
Read More
Telangana
ఆసక్తి రేపుతున్న 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
తెలంగాణ సంస్కృతి, ఆత్మీయత ఉట్టిపడేలా సాగే 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్,ప్రేక్షకుల్లో విశేష...
By Ponnala Srinivasrao 2026-05-20 05:16:19 0 172
Telangana
ఆసియా కప్ 2025 మనదే: పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్
హైదరాబాద్ : ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి భారత్ అద్భుత విజయం సాధించింది....
By Sidhu Maroju 2025-09-28 19:16:58 0 328
Andhra Pradesh
ఫ్యూజ్ క్యారియర్లకు బాక్సులు అమర్చాలి : స్థానికులు
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైళ్ళు వన్ బాబు కాలనీ రోడ్డువద్ద బహిరంగంగా ఉన్న విద్యుత్...
By Pagadala Venkateswar 2026-05-13 05:38:41 0 131
Telangana
రెబ్బెన KGBVలో ANM పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన కస్తూరిబా గాంధీ బాలికల...
By Chunarkar Jagadeesh 2026-08-04 13:17:32 0 364
Andhra Pradesh
పుంగనూరు: మైనర్లు వాహనాలు నడపడం నేరం: సీఐ
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, మైనర్లకు వాహనాలు ఇచ్చే...
By Kothuru Murali 2026-05-14 13:11:59 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com