ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.

0
142

స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు 

ఆక్వా, వరి రైతులకు ఇంధన కొరత రాకుండా చూడాలన్న మంత్రి

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు

ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తూ, కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత, అక్రమాలపై మంత్రి నాదెండ్ల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని హెచ్చరించారు.

 

ఈ సందర్బంగా ఇంధన బంకుల నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. కొన్ని బంకుల్లో స్టాక్ ఉన్నప్పటికీ 'నో స్టాక్' బోర్డులు పెట్టి వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారని, అలాంటి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంధన లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమలు చేస్తున్న 'రేషన్ పద్ధతి'ని కొనసాగించాలని సూచించారు.

 

ముఖ్యంగా ఆక్వా, వరి రైతులకు వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇంధన కొరతపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే వారిని గుర్తించి, వెంటనే కేసులు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.

 

ఇంధనం పోయడానికి నిరాకరిస్తున్న బంకులపై 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బంకుల మూసివేత గణనీయంగా తగ్గిందని, చమురు కంపెనీల నుంచి ఇంధన సరఫరా కూడా మెరుగుపడిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
ICG Rescues Foreign Crew from Stranded Yacht Near Nicobar Islands
 The Indian Coast Guard (ICG) successfully rescued two foreign nationals—a citizen of...
By Bharat Aawaz 2025-07-17 08:10:25 0 1K
Andhra Pradesh
దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Davos Tour Day 1*   *Press Release 5*   *ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌...
By Rajini Kumari 2026-01-20 10:24:40 0 206
Andhra Pradesh
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్.
అన్నమయ్య జిల్లాలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను బి.కొత్తకోట పోలీసులు మంగళవారం అరెస్ట్...
By Pagadala Venkateswar 2026-02-03 12:45:43 0 203
Andhra Pradesh
టిడ్కో కాలనీల్లో మౌలిక వసతులు త్వరగా పూర్తి చేయాలి: VZM కలెక్టర్
జిల్లాలోని అన్ని టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని...
By Boiena Rajesh 2026-07-15 16:42:38 1 182
Goa
Blue Tigresses Roar in Margao
The Indian Senior Women’s Football Team kicks off their highly anticipated SAFF...
By Dunna Jessicaruth 2026-05-25 05:40:12 0 95
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com