కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌!టీఆర్‌ఎస్‌ పేరును ఎలా ఇస్తారు?

0
166

కవిత ప్రకటించిన కొత్త పార్టీని అడ్డుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కవిత పార్టీకి ఆ పేరు ఎలా ఇస్తారు..? ఏ ప్రాతిపదికన పార్టీ పేర్లకు గుర్తింపును ఇస్తారని.. కేంద్ర ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి బీఆర్‌ఎస్‌ కీలక నేత ఫోన్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీఆర్‌ఎస్‌ ఇప్పటికే నిర్ణయించిన విషయం విదితమే.. ఇదే విషయమై ఢిల్లీ స్థాయి న్యాయ నిపుణులతో ఆ కీలక నేత చర్చించారని తెలిసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను నేరుగా కలిస్తే అందరికీ తెలిసిపోతుందని భావించిన సదరు కీలక నేత.. ఈసీఐలో రాజకీయ పార్టీల వ్యవహారాలకు సంబంధించిన సెక్షన్‌లో పనిచేసే జాయింట్‌ సెక్రటరీ స్థాయి అధికారికి ఫోన్‌ చేసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసలు రాజకీయ పార్టీల పేర్ల కేటాయింపు ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ పద్ధతిలో పేర్లు ఇస్తారు? అన్న అంశాలపై ఆ అధికారి నుంచి వివరణ కోరే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. ఈసీఐ పరిధిలోని వివరాలను ఫోన్ల ద్వారా గానీ.. వ్యక్తిగతంగా గానీ.. అడిగితే సమాధానం చెప్పలేమని ఆ అధికారి వెల్లడించినట్లు తెలిసింది. ఏమైనా వివరాలు కావాలంటే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే అధికారికంగా సమాధానం ఇచ్చే అవకాశముంటుందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

‎రాజకీయంగా నష్టముంటుందనే..

‎కవిత పార్టీ పేరు ‘టీఆర్‌ఎస్‌’ అని ఉంటే, అది తమ పాత పేరు కావడం వల్ల భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరుగుతుందని బీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధినేత కేసీఆర్‌తోపాటు గులాబీ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీఐ అధికారి కీలక నేతకు వివరాలు చెప్పకపోవడంతో బీఆర్‌ఎస్‌ వర్గం తదుపరి ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. పార్టీలకు ఒకే తరహా సంక్షిప్త పేర్లు ఉన్నప్పుడు దాన్ని నిలవరించడంలో చట్టపరమైన ఇబ్బందులేంటి? ఎన్నికల సంఘం వద్ద ఈ పేరును అడ్డుకునే అవకాశాలను న్యాయ నిపుణుల ద్వారా తెలుసుకోవాలని బీఆర్‌ఎస్‌ అధినేత సూచించినట్లు సమాచారం. కాగా.. టీఆర్‌ఎస్‌ సంక్షిప్త నామంతో ఇప్పటికే తన పార్టీ ఉందని, ఇప్పుడదే పేరుతో కవిత కొత్త పార్టీ ఉండటం వల్ల రాజకీయంగా తనకు ఇబ్బందులుంటాయని సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

Search
Categories
Read More
Telangana
మోండా రూపం మార్చే రోడ్లు – ఎమ్మెల్యే శ్రీగణేష్‌తో అభివృద్ధికి శ్రీకారం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా:  కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా...
By Sidhu Maroju 2026-04-15 06:34:21 0 205
SURAKSHA
తెలంగాణ పోలీసులు పేదలకు అన్నదానం, ఉచిత వైద్యం
ఈరోజు తెలంగాణ పోలీస్ సిబ్బంది నగరంలోని రోడ్డుపక్కన నివసించే నిరుపేదలకు వేడివేడి అన్నం, తాగునీరు...
By Kalaga Sailaja 2026-07-06 04:53:42 0 129
International
EAM Dr. S. Jaishankar Meet FBI Director Kash Patel.....
EAM Dr. S. Jaishankar: Great to meet FBI Director Kash Patel today.  Appreciate our strong...
By Bharat Aawaz 2025-07-03 07:30:16 0 3K
Andhra Pradesh
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టండి
ప్రచురణార్థం 19.12.2025 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబి జి...
By Rajini Kumari 2025-12-19 11:51:15 0 266
Andhra Pradesh
దర్శి పట్టణంలోని పొదిలి రోడ్‌లో పి.జి.ఎన్. కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి గోల్డ్ రికవరీ & బయర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం
దర్శి పట్టణంలోని పొదిలి రోడ్‌లో పి.జి.ఎన్. కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి...
By Chennaiah Kati 2026-06-29 05:46:44 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com