ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టండి
ప్రచురణార్థం 19.12.2025
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబి జి రామ్ జి స్కీమ్ రద్దు చేయాలి.
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టండి.
ప్రజలకు సిపిఎం పిలుపు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబి జి రామ్ జి స్కీమ్ రద్దు చేయాలని, 2005లో వామపక్షాల వత్తిడితో యూపీఏ వన్ ప్రభుత్వం తెచ్చిన మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పి కొట్టాలని, ప్రజలకు సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిన్న పార్లమెంట్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి విబి.జి. రామ్.జి పేరుతో పథకం రూపంలో దాన్ని మార్చడం దుర్మార్గమైన చర్య అని, కోట్లాది మంది గ్రామీణ పేద ప్రజల పొట్ట కొట్టడమేనని ఆయన తీవ్రంగా విమర్శించాడు. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్ట సవరణకు వ్యతిరేకంగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబి జి రామ్ జి స్కీమ్ రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్న గాంధీ విగ్రహం ముందు నల్లజెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజలకు మేలు చేయకపోగా మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ కాలం గడపడమే పనిగా పెట్టుకున్నాడని ఆయన తీవ్రంగా మండిపడ్డాడు.
దేశంలో నూటికి 20 శాతం మంది పేదలకు మూడు పూటలా తిండి లేక అర్ధాలతో ఉన్నటువంటి వారికి, పనులు లేక వలసలు వెళ్లే పేదల కోసం, 2005లో ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వామపక్షాల ప్రోత్బలంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చారన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టడం కోసం తెచ్చిన ఈ చట్టాన్ని కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉపాధి హామీ చట్టంలో అనేక మార్పులు తెస్తూ క్రమంగా చట్టాన్ని స్కీమ్ గా మార్చి రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు, దేశంలో కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్న ఈ ప్రభుత్వం పేదల పట్ల చిన్నచూపు చూస్తుందని ఆయన విమర్శించాడు. గత పదేళ్లలో ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తున్నారని, రెండు పూటల పని విధానం తీసుకుని వచ్చారని, పనిచేసిన కూలీలకు వారంలోగా వేతనాలు ఇవ్వాలని చట్టంలో ఉన్న నేటికీ ఐదు నెలలైనా బకాయిలు చెల్లించక పోవడం చూస్తుంటే మతోన్మాద ప్రభుత్వానికి పేదల పట్ల ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని ఆయన విమర్శించాడు. కేంద్ర ప్రభుత్వం అనే పేరుతో తెచ్చిన పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు వేసిందని ఈ పథకానికి పూర్తిస్థాయి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలని చట్టంలో ఉన్నప్పటికీ దానిని తుంగలో తొక్కిందని, కేంద్రం 60 శాతం రాష్ట్రం 40% వాటాలు చెల్లించేలా పథకాన్ని ఆయన విమర్శించాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 40 శాతం నిధులు చెల్లించడానికి సిద్ధమేనా దీనికి సమాధానం ఏంటో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు.
పార్లమెంట్లో అడ్డగోలుగా బిల్లు పెట్టితే మన రాష్ట్రంలో ఉండే 25 మంది అధికార ప్రతిపక్ష పార్టీల పార్లమెంటు సభ్యులు బిల్లుకు ఆమోదం తెలపడం సిగ్గుచేటని ఆయన విమర్శించాడు, కర్నూలు జిల్లాలో ప్రజలు నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతుంటే ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత గంజినీయులైన తాగుతున్నారని ఆయన తెలిపారు. ఈ పథకం అమలు చేయకపోతే పేదలు ఆకలితో అలమటించాల్సి వస్తుందని ఈ పథకాన్ని రక్షించుకునేందుకు సిపిఎం పోరాటం చేస్తుందని ఆయన తెలియజేశాడు. అందుకోసమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రక్షించుకునేందుకు విబిజి రాంజీ అనే పథకాన్ని రద్దు చేసే వరకు పోరాటాలు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చాడు.
అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కెవి నారాయణ, పిఎస్ రాధాకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో ఏటా పది లక్షల మంది సుధీర ప్రాంతాలకు వలసలు పోతున్నారు మన జిల్లాకు వరంగా ఉన్న ఈ పథకాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని, మన జిల్లా పార్లమెంటు సభ్యుడు అందరికీ అర్జీలు ఇస్తాడు కానీ 10 లక్షల మంది వలసలు పోతారు మా జిల్లాలోని నోరు మెదపలేని దౌర్భాగ్య పరిస్థితిలో పార్లమెంటు సభ్యుడు ఉన్నాడని వారు విమర్శించారు, భవిష్యత్తులో సిపిఎం పార్టీగా ఉపాధి హామీ పరిరక్షణ కోసం కార్యాచరణ రూపొందిస్తామని గతంలో వామపక్షాలుగా తెచ్చిన ఈ చట్టాన్ని కాపాడుకుంటామని ప్రజల్ని ఐక్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగడతామని వారు తెలియజేశారు, సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు టీ. రాముడు మాట్లాడుతూ వి బి జి రాంజీ రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించాడు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సభ్యులు ఎం డి ఆనంద్ బాబు, ఎండి అంజిబాబు, జిల్లా నాయకులు సి గురు శేఖర్, ఎన్ అలివేలమ్మ, నగర నాయకులు విజయ్, నగేష్, సాయిబాబా, నరసింహులు, సుధాకారప్ప, ఎస్ఎండి షరీఫ్, అబ్దుల్ దేశాయ్, కే రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy