ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
Posted 2026-04-26 12:24:34
0
184
మందమర్రి మండలం పొన్నారం గ్రామ పంచాయతీలో నల్లెల్లి వినీత్ – శ్రావంతి దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ హాజరై, ఇందిరమ్మ ఇల్లు గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి గృహాన్ని ప్రారంభించి, వాస్తు పూజలో పాల్గొన్నారు.
ఎంపీ మాట్లాడుతూ, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇలాంటి పథకాల ద్వారా సామాన్య ప్రజలకు నిజమైన సంక్షేమం చేరుతోందని తెలిపారు.
వినీత్ – శ్రావంతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, కొత్త ఇంటిలో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అడవి తల్లి దీవెన.... గుంజేడు ముసలమ్మ జాతర!
ఈ జాతర కేవలం మొక్కుల పండుగే కాదు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టే వేదిక
ఈనెల 4 నుండి గుంజేడులో...
నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా ఎన్నికైన తోకల శ్రీనివాస్ రెడ్డి....
భారత్ ఆవాజ్ న్యూస్ :24 జూన్ రోజున నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా కాంగ్రెస్...
నెల్లూరులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఘనస్వాగతం.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు....
ఏపీ కొత్త జిల్లాల ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది....