అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం గద్దె రామ్మోహన్

0
195

*అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు, ఇళ్ళ స్థలాలు అందజేస్తాం*

*ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

++++

 

           అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫించన్ల మంజూరు, ఇళ్ళ స్థలాల కేటాయింపు చేస్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

   పటమట అశోక్‌నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ప్రజాదర్బార్‌ కార్యక్రమం శుక్రవారం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హజరై ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతిపత్రాలను స్వీకరించారు. 

   

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని ఎమ్మెల్యేలందరితో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారని, ఈ సమావేశంలో ప్రజాదర్బార్‌లో వచ్చిన ముఖ్యమైన సమస్యలను ఆయనకు తెలియజేస్తానని శాసనసభ్యులు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని అందువల్ల ఆ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రజాదర్బార్‌లో తెలియజేసిన సమస్యల్లో ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఫించన్ల మంజూరు, ఇళ్ళ స్థలాల కేటాయింపుపై ప్రజలు ఎక్కువుగా అడుగుతున్నారని, ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామనని చెప్పారు. ఆటోనగర్‌లో విద్యుత్‌ సమస్యల పరిష్కారంపై విద్యుత్‌ శాఖ ఎస్‌ఈతో మాట్లాడతానన్నారు. ప్రజదర్బార్‌లో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, వివిద కార్పొరేషన్ల డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ డివిజన్‌ అధ్యక్షులు, పార్టీ నాయకులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Nagaland
Dimapur Smart City Project Picks Up Pace with Green Initiatives
Under the Smart Cities Mission, Dimapur is witnessing a wave of transformation. The...
By Bharat Aawaz 2025-07-17 11:08:28 0 1K
Telangana
రవాణా శాఖ అధికారిని బలికొన్న బొగ్గు టిప్పర్
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామ పరిధిలోని భూపాలపల్లి పర్కాల ప్రధాన రోడ్డుపై ఉన్న...
By Sriramula Anil 2026-06-23 01:35:29 0 303
Andhra Pradesh
మదనపల్లిలో మృతురాలి ఆచూకీ లభ్యం.
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని మహిళను స్థానిక...
By Pagadala Venkateswar 2026-01-27 06:53:45 0 204
Andhra Pradesh
ఆశీర్వాద కా దియా’ కార్యక్రమంలో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ గణబాబు
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ...
By Santhosh Kumar 2026-09-17 17:58:20 0 93
SURAKSHA
Operation Toofan: Kerala Police’s Major Anti-Drug Success
In a massive crackdown against the narcotics trade, the Kerala Police have marked a historic...
By Lokeshwari Panthadi 2026-07-03 07:21:55 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com