హైదరాబాద్లో గాంధీ భవన్లో సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశం లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
214

హైదరాబాద్‌ గాంధీ భవన్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ సమీక్షా సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, సభ్యత్వ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరై పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేశారు. ఇతర ఎంపీలు, డీసీసీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, బూత్ స్థాయిలో కేడర్‌ను చురుకుగా పనిచేయించే విధంగా ప్రణాళికలు రూపొందించాలి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించాలి, పార్టీ సిద్ధాంతాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. ‘సంఘటన్ సృజన్ అభియాన్’ ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణం మరింత బలపడుతుందని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: రైతులకు అపార నష్టం కలిగిస్తున్న ఒంటరి ఏనుగు
మండలం, పాలెం పంచాయతీలో శనివారం ఒంటరి ఏనుగు దాడిలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులైన...
By Kothuru Murali 2026-05-16 15:54:49 0 145
Manipur
Manipur Strengthens Women and Child Welfare Programs
Manipur continues to expand women and child welfare initiatives through programs focused on...
By Fathima Safa 2026-07-03 16:04:07 0 87
Andhra Pradesh
ఎన్టీఆర్ వైద్యసేవ: ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు షురూ.
ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపు ప్రారంభం 'బిల్ డిస్కౌంటింగ్' విధానంలో...
By Pagadala Venkateswar 2026-04-28 05:04:33 0 133
Andhra Pradesh
పవన్ కళ్యాణ్: సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజా అవగాహన ఉద్యమం ప్రారంభం |
పవన్ కళ్యాణ్: సింగిల్-యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజా అవగాహన ఉద్యమం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...
By Bharat Aawaz 2025-09-20 10:07:41 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com