Govt request for to call of rtc strike

0
212

ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసింది. చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది. కార్మిక సంఘాల ప్రతినిధులతో రేపు (శుక్రవారం) చర్చలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని మంత్రుల బృందానికి చెప్పారు.

 

✳️ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సుదీర్ఘంగా చర్చించింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సమావేశంలో ముఖ్యమంత్రి గారు సూచించారు.

 

✳️ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు విషయాన్ని మంత్రివర్గ సమావేశం చర్చించింది. జ్యుడీషియల్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు తప్పుబట్టలేదని, పైగా కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడిందని సమావేశంలో అడ్వకేట్ జనరల్ తీర్పు వివరాలను వెల్లడించారు.

 

✳️ ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.

 

✳️ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి బెనిఫిట్స్ అందించే అంశంపై మంత్రివర్గ సమావేశం చర్చించింది. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ. 6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ. 8 వేల కోట్లు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.

 

✳️ ఆర్థిక వనరుల సమీకరణలో భాగంగా ప్రజాప్రతినిధుల జీతాల్లో 50 శాతం తగ్గించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సర్దుబాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపాదనపై మంత్రులంతా ఉదారంగా ముందుకొచ్చి తమ ఆమోదం తెలియజేశారు.

 

✳️ అలాగే, రిసోర్స్ మొబిలైజేషన్ కోసం నియమించిన సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు జరపాలని, ఆర్థిక వనరుల సమీకరణతో పాటు వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు.

 

✳️ హైదరాబాద్‌లోని గచ్చీబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్టేడియంకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించారు.

 

✳️ అంతకుముందు మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు విడిగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని, కార్మికుల డిమాండ్లపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ సమయంలో కార్మికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

 

✳️ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, అనాలోచిత చర్యలకు పాల్పడి తమ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని కోరారు. క్షణికావేశంలో ఆత్మబలిదానాలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పూర్తిగా సానుకూల దృక్పథంతో ఉందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డి.ఎస్.బి.సి.యు చైర్మన్ కడియం మణికంఠ ను సన్మానించిన ఎమ్మెల్యే కొండయ్య
చీరాల  ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ (డిఎస్ బీసీయూ )కు త్రిసభ్య...
By Vadlamudi NagaVenkat 2026-06-20 06:12:09 0 350
Telangana
గ్రామ పంచాయతీలకు.. నిధులు విడుదల
*రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం తీపికబురు అందించింది. సంక్రాంతి పండుగను...
By CM_ Krishna 2026-01-14 05:00:14 0 404
SURAKSHA
కమ్యూనిటీ పోలీసింగ్: ప్రజలతో మమేకం
పోలీసు వ్యవస్థకు, ప్రజలకు మధ్య నమ్మకాన్ని, బంధాన్ని బలపరిచే అద్భుతమైన విధానమే 'కమ్యూనిటీ...
By Kalaga Sailaja 2026-06-26 05:49:14 0 96
SURAKSHA
Mukesh Kumar Meena, IAS: Champion of Good Governance
A Distinguished Administrator Driving Andhra Pradesh's Growth Through Visionary Leadership and...
By Lokeshwari Panthadi 2026-07-11 05:56:51 0 201
SURAKSHA
Nivedita Lairenlakpam, IAS: Inspiring Manipur's Progress
A dedicated IAS officer whose commitment to transparent governance, citizen-centric...
By Lokeshwari Panthadi 2026-07-22 09:21:56 0 202
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com