నిజామాబాద్.:కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...

1
418

తేదీ:23.04.2026.

నిజామాబాద్.కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పును హర్షించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...

నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల గారు మాట్లాడుతూ...కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించడం ద్వారా న్యాయం గెలిచిందని పేర్కొన్నారు.

కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిందన్నారు.

ముఖ్యంగా సెక్షన్–8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకమని తెలిపారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారిపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్‌లను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు.

న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా, చివరకు నిజం గెలిచిందని పేర్కొన్నారు.

తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయని విమర్శించారు.ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారని అన్నారు.కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిపై చేసిన ఆరోపణలు నిరాధారమని ఈ తీర్పుతో స్పష్టమైందని, కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు ఈ తీర్పుతో ఇకనైనా కనువిప్పు కలగాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గణేష్ బిగాల గారు సూచించారు.న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి ఈ హైకోర్టు తీర్పు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ VG గౌడ్ గారు,మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్,పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి,సుజిత్ సింగ్,నవీద్ ఇక్బాల్, గాండ్ల లింగం,మతీన్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
By Pagadala Venkateswar 2026-01-20 06:18:08 0 224
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Strengthens Disaster Management
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen disaster management through...
By Fathima Safa 2026-07-02 07:39:35 0 250
Andhra Pradesh
ప్రత్తిపాడులో తృటిలో తప్పిన ప్రమాదం
ప్రత్తిపాడులో శుక్రవారం వైసీపీ ర్యాలీ అనంతరం గుంటూరు వైపు వెళ్తున్న సమయంలో ఒక టీవీఎస్...
By SivaNagendra Annapareddy 2026-06-12 14:34:17 0 293
Andhra Pradesh
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
  భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-09 14:57:10 0 133
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:04:53 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com