గ్రామ సంఘాల సహాయకులకు(VOA) స్మార్ట్ ఫోన్లు పంపిణీ

0
344

గ్రామ సంఘాల అభివృద్ధికి స్మార్ట్ అడుగు – VOAలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

నందిగామలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా ఫోన్ల అందజేత..

నందిగామ, బుధవారం: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సంఘాల సహాయకులకు (VOAలు) స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నాడు నందిగామ పట్టణంలోని రైతుపేట ఓసీ క్లబ్‌లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై కూటమి నేతలతో కలిసి VOAలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సేవల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతికత ఎంతో కీలకమని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల ద్వారా గ్రామ సంఘాల కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో VOAల పాత్ర ముఖ్యమని, వారికి అందిస్తున్న ఈ సౌకర్యాలు గ్రామీణాభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న VOAలు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ పనితీరును మరింత మెరుగుపర్చేందుకు ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు.ఈకార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సమైక్య అధ్యక్షురాలు కందుల కల్పన, మండల సమైక్య అధ్యక్షులు, మార్కెట్ కమిటీల రాష్ట్ర ఉపాధ్యక్షులు కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, స్థానిక కూటమి నాయకులు, అధికారులు, గ్రామ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
తనిఖీ కమిటీలలో బాధితులను భాగస్వామ్యం చేయాలని కీలక సూచన గోస్తనీ నది కాలుష్యంపై అత్యవసర...
By Pagadala Venkateswar 2026-05-21 07:12:48 0 103
Telangana
బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మను దగ్ధం చేసిన క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు,
క్యాతనపల్లి మున్సిపాలిటీ అమ్మ గార్డెన్ స్టేజి దగ్గర గద్దెరాగడిలో పట్టణ అధ్యక్షులు పల్లె రాజు...
By Avunoori Mahesh 2026-04-18 07:51:07 0 309
Andhra Pradesh
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ
విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం...
By Mobbu Venkatramana 2026-03-10 11:22:46 0 326
Telangana
కాంగ్రెస్ పార్టీకి కళ్లెం బిక్షపతి సేవలు వెలకట్టలేనివి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట 25 రాజపేట మండలం కాలువ పెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్...
By Pindikura Mahesh 2026-05-25 16:19:45 0 153
Telangana
గణేష్‌ మండపాల నిర్వాహకులతో పోలీసుల భేటీ.|
అల్వాల్, సెప్టెంబర్ 10: గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై...
By Sidhu Maroju 2026-09-10 15:49:37 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com