ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మేయర్ : ధర్ని మధుకర్

0
217

మంచిర్యాల : ఈశ్వర్ ప్రసాద్ స్మరక ఉమ్మడి ఆదిలాబాద్ వాలీబాల్ టోర్నమెంట్ ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల నలుమూల నుండి 32 టీములు పాల్గొనడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు భోజన సదుపాయాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమకూర్చడం జరిగింది, మొదటి బహుమతి 20,000 /- స్వరూప హాస్పిటల్ మంచిర్యాల, రెండవ బహుమతి 15,000/- ట్రినిటీ హైస్కూల్ మంచిర్యాల, మూడో బహుమతి 10,000/- నారాయణ సర్జికల్ హాస్పిటల్ మంచిర్యాల, నాలుగో బహుమతి 5,000/- వంశీ బిల్డర్స్ మంచిర్యాల లు సమకూర్చడం జరిగింది.

ఈ టోర్నమెంట్ ను ఉద్దేశించి మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అన్ని క్రీడలను ప్రోత్సహిస్తుంది ప్రత్యేక క్రీడా పాలసీని తీసుకువచ్చింది దీని ద్వారా రాష్ట్రంలో అన్ని క్రీడలలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడానికి వీలవుతుందని అదేవిధంగా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించి మంచిర్యాల సాయి కుంటలో స్టేడియం నిర్మాణానికి గాను 14 ఎకరాల స్థలాన్ని కేటాయించి అంతర్జాతీయ స్థాయిలో అన్ని క్రీడాంశాలకు సంబంధించి క్రీడా వసతులతో ప్రత్యేక శ్రద్ధతో అతి త్వరలో ఈ స్టేడియంలో మంచిర్యాల ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి రావుల రామ్మోహన్, ఉపాధ్యక్షులు బైరగొని సిద్దయ్య గౌడ్, ట్రెజరర్ గాజుల శ్రీనివాస్, జాతీయ వాలీబాల్ క్రీడాకారులు లక్షట్టి గురవయ్య, చిందం శ్రీనివాస్ సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత లక్షెట్టి లక్ష్మీనారాయణ, గడియార మురళి, సల్కాపురం రఘు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
SURAKSHA
Odisha Cyber Police Warn Against Online Fraud
: To protect citizens from digital scams, Odisha Police cyber cell held an awareness session for...
By Kalaga Sailaja 2026-07-06 10:58:14 0 391
Andhra Pradesh
పేకాట స్థావరం పై దాడి....నలుగురు అరెస్ట్.
మదనపల్లె మండలంలోని కాట్లాటపల్లి రోడ్డులో పేకాట ఆడుతున్న నలుగురిని ఆదివారం సాయంత్రం అరెస్టు...
By Pagadala Venkateswar 2026-05-25 04:33:55 0 117
Andhra Pradesh
చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు
బాపట్ల జిల్లా:  చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను  సందర్శించిన...
By Gadiyapudi Narendra 2026-02-12 13:05:09 0 225
Andhra Pradesh
పుంగనూరు: సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన రైతులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం గోపిశెట్టి పల్లి గ్రామ సమీపంలో పెప్పర్ మోషన్ ఎలక్ట్రికల్ బస్సుల...
By Kothuru Murali 2026-05-26 11:29:02 0 114
Uttar Pradesh
Uttar Pradesh 2026: Healthcare and Medical Expansion
Uttar Pradesh is strengthening its healthcare system in 2026 through various initiatives focused...
By Fathima Safa 2026-06-16 11:44:49 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com