రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ

0
19

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

విజయవాడ,

తేది : 18 డిసెంబర్‌, 2025.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

విషయం: నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలవరం జిల్లా నందు పోలవరం నియోజకవర్గంలో ఉన్న షెడ్యూల్‌ ప్రాంతం మరియు నాన్‌ షెడ్యూల్‌లో ఉన్న ఆదివాసీ గ్రామాలను కలపమని కోరుతూ...

 సూచిక : జి.వో. ఎం.ఎస్‌. నెంబర్‌ 74, లా (ఎఫ్‌) డిపార్ట్‌మెంట్‌ తేది : 1-12-2025

 

అయ్యా!

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రకటించిన పోలవరం జిల్లా ఏర్పాటు ప్రకటన ఏలూరు ఏజన్సీ ప్రజల్ని నిరాశపర్చింది. పోలవరం జిల్లాలో పోలవరం లేకపోవడం నేతిబీరకాయలో నెయ్యి లేనట్లు గా ఉందని ప్రజలు భావిస్తున్నారు. పోలవరం నిర్వాసిత ప్రాంతాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని ఎన్నికల సందర్భంగా మీరు హామీ ఇచ్చారని గుర్తు చేయదలచు కున్నాను. 

 

పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నిర్వాసితులకు పునరావాసం పూర్తిస్థాయిలో కల్పించాలి. అదొక దీర్ఘ కాలిక అంశమని మీకు తెలుసు. అందుకు నిర్వాసిత ప్రాతం, పునరావాసం కల్పించే ప్రాంతం ఒకే కార్యానిర్వహక ప్రాంతంగా ఉంటే సమన్వయానికి, కార్యాచరణ అమలుకు పూర్తిస్థాయిలో వీలు ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల రంపచోడవరం నియోజకవర్గంలో చింతూరు, ఎటపాక, కూనవరం, వి.ఆర్‌.పురం, దేవిపట్నం, పోలవరం నియోజకవర్గంలో పోలవరం, కుకునూరు, వేలేరుపాడు ప్రజలు నిర్వాసితులవుతారు. వీరికి ఏలూరు జిల్లాలో పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, కొయ్యలగూడెం మండలాలతోపాటు జంగారెడ్డిగూడెం మండలాల్లో పునరావాసం కల్పిస్తున్నారు. అలాగే రంపచోడవరం నియోజకవర్గం మండలాల వారిలో చాలా మందికి సైతం పునరావాసం కల్పిస్తున్నారు. ఇప్పటికే కల్పించిన వారికి పలు సమస్యలున్నాయి. భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురౌతాయి. వీటిని పరిష్కరించడానికి ఈ ప్రాంతమంతా ఒకే కార్యనిర్వాహక యూనిట్‌గా ఉండటం అవసరం. రాష్ట్ర విభజన సందర్భంగా మునక ప్రాంతాలను తెలంగాణా నుండి ఆంధ్రాలో కలపడానికి వర్తించిన విధానమే దీనికి వర్తిస్తుందని మీ దృష్టికి తెస్తున్నాను.

 

కాబట్టి పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలోని 5 షెడ్యూలు (పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, కుకునూరు, వేలేరుపాడు) మండలాలు టి.నర్సాపురం-18, కొయ్యలగూడెం-7, గోపాలపురం-3, జంగారెడ్డిగూడెం-1 గిరిజన గ్రామాలు చేర్చాలి. గత ప్రభుత్వం కాలంలో నాన్‌ షెడ్యూల్‌ ప్రాంతంలోని ఈ 29 గ్రామాలు షెడ్యూల్‌ ప్రాంతంలో చేర్చేందుకు గ్రామసభల ప్రక్రియను కూడా నిర్వహించారు. ఇందువల్ల నిర్వాసితులకు పునరావాసంతో పాటు ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడానికి తోడ్పడుతుంది. ఏజన్సీ ప్రాంత (షెడ్యూల్‌) చట్టాల అమలుకు, ఆదివాసీలపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. రంపచోడవరంతో పాటు పోలవరం కూడ S.T నియోజకవర్గాలు కావడం వల్ల గిరిజనుల ఉనికి, గుర్తింపు, గిరిజనుల ప్రయోజనాలను కాపాడడానికి ఒకే షెడ్యూల్డు ప్రాంత యూనిట్ గ పరిగణించడానికి దోహదపడుతుంది.

 

కావున పోలవరం ప్రాంతానికి, ఈ ప్రాంత ఆదివాసీలకు న్యాయం చేసేందుకు పోలవరం జిల్లాలో పోలవరంలోని ఆదివాసీ ప్రాంతాలను చేర్చాలని కోరుతున్నాను. ప్రభుత్వం ఈ అంశాన్ని తప్పకుండా పరిగణనలోకి టీకుంటుందని ఆశిస్తున్నాను.

అభివందనములతో...

                                                                                                                   (వి. శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి

Search
Categories
Read More
Telangana
హిందూ స్మశాన వాటికను కాపాడండి: కాలనీవాసుల వేడుకోలు
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారంలోని హిందూ స్మశానవాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని...
By Sidhu Maroju 2025-06-08 08:54:09 0 1K
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ సభ్యులకు పొంగులేటి క్యాంప్ నుంచి అభినందనలు...
ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-16 18:37:59 0 36
Telangana
"క్రిసలిస్ హైట్స్" ప్రైమరీ స్కూల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద్.
జీడిమెట్ల డివిజన్ ఎం. ఎన్.రెడ్డి నగర్ లో గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన...
By Sidhu Maroju 2025-06-15 16:34:25 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com